Published : 07/07/2022 20:39 IST

పొట్ట తగ్గాలంటే..

వ్యాయామం చేయకపోవడం, జీవనశైలిలో మార్పుల నేపథ్యంలో బరువుతో పాటు పొట్ట కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు కొవ్వు పదార్థాలు తగ్గించడం మాత్రమే కాదు.. కొన్ని పదార్థాలను రోజూ తీసుకోవాలి. వాటిలోని పోషకాలు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా చూస్తాయి.

బాదం

మోనోశ్యాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ శరీరంలో కొవ్వును కరిగించే శక్తిని పెంచుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటివల్ల శరీరంలో నీరు కూడా పేరుకోకుండా ఉంటుంది. ఆ పోషకాలు అందాలంటే బాదంతో పాటు ఇతర నట్స్‌ కూడా తినాలి.

ఓట్స్

ఉదయం పూట నూనెతో చేసిన అల్పాహారాలకు బదులుగా ఓట్స్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా జీవక్రియల రేటు వృద్ధి అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. తక్షణ శక్తి అంది ఎక్కువ సమయం ఆకలి వేయదు. దీనిలోని పీచు కూడా జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఓట్స్‌ తీసుకునేటప్పుడు అందులో చక్కెరకు బదులుగా ఏవైనా తాజా పండ్ల ముక్కలు, రసాలు కలిపితే సహజ చక్కెర్లు అందుతాయి. పొట్ట వస్తుందనే భయం కూడా ఉండదు.

గుడ్డు

మాంసకృత్తులు అధికంగా అందించే గుడ్డు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కరిగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా తెల్లసొన తీసుకోవడం వల్ల బి12, డి విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అధికంగా అందుతాయి. ఇవి బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల ఎముక సాంద్రత పెరుగుతుంది. గుండె పని తీరు కూడా మెరుగవుతుంది.

పండ్లు..

ఆకలిగా అనిపించినప్పుడు ఏ మిఠాయిలో, ఇతర చిరుతిళ్లో తినే బదులు.. పండ్లు ఎంచుకోవడం మంచిది. వీటివల్ల చక్కెర, కొవ్వు శరీరంలో చేరతాయన్న బాధ ఉండదు. పోషకాలూ ఎక్కువగా అందుతాయి. బరువూ తగ్గుతారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని