ఈ చిట్కాలతో వేసవిలోనూ హుషారుగా!
ఉన్నట్లుండి నీరసంగా, కళ్లు తిరుగుతున్నట్లనిపించడం.. ఈ వేసవిలో చాలామందికి ఎదురయ్యే సమస్యే. శరీరం బలహీనంగా ఉండడం, రక్తహీనత, విటమిన్ల లోపం, ఎండలో ఎక్కువగా తిరగడం.. వంటివన్నీ ఇందుకు కారణాలు. ఈ సమస్యల...
ఉన్నట్లుండి నీరసంగా, కళ్లు తిరుగుతున్నట్లనిపించడం.. ఈ వేసవిలో చాలామందికి ఎదురయ్యే సమస్యే. శరీరం బలహీనంగా ఉండడం, రక్తహీనత, విటమిన్ల లోపం, ఎండలో ఎక్కువగా తిరగడం.. వంటివన్నీ ఇందుకు కారణాలు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో చూద్దామా..
* సమయానికి ఆహారం తీసుకోవాలి. అలాగే రోజులో కనీసం 10 గ్లాసుల నీళ్లు తాగాలి. శరీరంలో ఆహారంతో పాటు నీటి శాతం తగ్గకూడదు. అలా తగ్గితే కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంది. గంటకోసారి గ్లాసు నీటిని తాగుతూ ఉంటే ఈ సమస్యకు దూరంగా ఉండచ్చు.
* అప్పుడప్పుడు శరీరానికి విశ్రాంతినిస్తూ ఉండాలి. లేదంటే శరీరం త్వరగా అలసిపోతుంది. కొన్నిసార్లు నిద్రలేమితోనూ అలసటగా, ఒత్తిడిగా అనిపిస్తుంది. అప్పుడు కూడా విపరీతమైన నీరసం, కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి, వేళకు నిద్రపోయేలా, సరైన సమయం నిద్రకు కేటాయించేలా చూసుకోవాలి. అలాగే ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం కూడా ముఖ్యమే.
* ఉసిరి రసం, అల్లం రసం, చక్కెర.. ఈ మూడూ కప్పు చొప్పున తీసుకొని కలిపి, మరిగించి పానీయంలా తయారుచేసి భద్రపరుచుకోవాలి. ప్రతిరోజూ రెండు పూటలా 30 ఎంఎల్ పరిమాణంలో ఈ పానీయాన్ని తాగితే నీరసం దరిచేరదు. అలాగే అరకప్పు పానీయంలో అరకప్పు మంచి నీటిని కలిపి తాగొచ్చు. ఇది తక్షణ శక్తినిస్తుంది.
* గ్లాసు పల్చని మజ్జిగలో చెంచా గులాబీ రేకల ముద్ద, చెంచా చక్కెర కలిపి తాగితే నీరసం నుంచి ఉపశమనం కలుగుతుంది.
* గ్లాసు గోరువెచ్చని నీటిలో పెద్ద చెంచా నిమ్మరసం, చెంచా అల్లం రసం, రెండు చెంచాల తేనె కలిపి తాగితే నీరసం నుంచి తేరుకోవచ్చు.
* గ్లాసు పల్చని మజ్జిగలో పుదీనా రసం, నిమ్మరసం చెంచా చొప్పున కలిపి అందులో చిటికెడు ఉప్పు వేసి తాగాలి. దీంతో కళ్లు తిరగడం తగ్గి, శక్తి వస్తుంది.
* గ్లాసు నల్లద్రాక్ష రసం తాగినా నీరసం నుంచి తేరుకోవచ్చు.
* మంచి కర్పూరం వాసన చూస్తే మెదడు ఉత్తేజితమై, నీరసం తగ్గుతుంది.
* మంచి గంధం, కర్పూరం, కొంచెం కొబ్బరి నూనె కలిపి నుదుటిపై లేపనంలా రాసుకుంటే అలసట, నీరసం నుంచి బయటపడచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!