పండ్లపై పురుగులు వాలకుండా..

ముక్కలుగా కోసిన పండ్ల మీద ఓ పది నిమిషాల పాటు మూత పెట్టకుండా ఉంటే చాలు.. ఎక్కడ నుంచి వస్తాయో.. ఎలా వస్తాయో తెలీదు! చిన్న చిన్న పురుగులు ఎగురుకుంటూ వచ్చి మరీ వాటిపై వాలిపోతుంటాయి. అవి కేవలం పండ్ల పైనే కాదు.. కూరగాయలపై కూడా వాలుతుంటాయి. వీటి బెడద తొలగించుకోవడం...

Published : 27 Feb 2023 21:15 IST

ముక్కలుగా కోసిన పండ్ల మీద ఓ పది నిమిషాల పాటు మూత పెట్టకుండా ఉంటే చాలు.. ఎక్కడ నుంచి వస్తాయో.. ఎలా వస్తాయో తెలీదు! చిన్న చిన్న పురుగులు ఎగురుకుంటూ వచ్చి మరీ వాటిపై వాలిపోతుంటాయి. అవి కేవలం పండ్ల పైనే కాదు.. కూరగాయలపై కూడా వాలుతుంటాయి. వీటి బెడద తొలగించుకోవడం కాస్త కష్టతరమే. ఎందుకంటే శ్రమించి వాటిని వెళ్లగొట్టినా రెండు నిమిషాలకి మళ్లీ వచ్చేస్తాయి. అలాగని కాస్త ముగ్గిన పండ్లు, కూరగాయలపై ఎక్కువగా వాలే ఈ తరహా పురుగులను వదిలించుకోవడానికి రసాయనాలు ఉపయోగిస్తే మనకే ప్రమాదకరం. అయితే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి పాటించే చిట్కాల ద్వారా వాటిని సులభంగా తరిమికొట్టవచ్చు. మరి, అవేంటో తెలుసుకుందామా..

లిక్విడ్ డిష్‌వాష్‌తో..

పండ్ల మీద వాలే కీటకాలను వెళ్లగొట్టడంలో లిక్విడ్ డిష్‌వాష్ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా నిమ్మ సువాసనలు వెదజల్లే డిష్‌వాష్ ఇందుకు బాగా ఉపకరిస్తుంది. కొద్దిగా లిక్విడ్ డిష్‌వాష్ తీసుకొని అందులో కాస్త నీళ్లు కలిపి స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. గది మూలల్లోను, పురుగులు ఎక్కువగా కనిపిస్తున్న ప్రదేశాల్లోనూ ఈ మిశ్రమాన్ని స్ప్రే చేయడం ద్వారా వాటిని సులభంగా తరిమికొట్టవచ్చు.

నిమ్మగడ్డి నూనెతో..

నిమ్మగడ్డి నూనెతో తయారుచేసిన స్ప్రేను ఉపయోగించడం ద్వారా కూడా పండ్లు, కూరగాయల మీద వాలే పురుగుల నుంచి విముక్తి పొందవచ్చు. పావుకప్పు వేణ్నీళ్లలో పది చుక్కల లెమన్‌గ్రాస్ ఆయిల్‌ను కలపాలి. దీన్ని స్ప్రేబాటిల్‌లో పోసి కిటికీలు, తలుపులు వద్ద స్ప్రే చేస్తే సరిపోతుంది.

పాలతో..

గిన్నెలో కొద్దిగా పాలు తీసుకొని అందులో కొద్దిగా పంచదార, మిరియాల పొడి వేయాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్‌పై ఉంచి పది నుంచి పదిహేను నిమిషాల పాటు సన్నని సెగపై వేడిచేయాలి. పురుగులు ఎక్కువగా కనిపించిన ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని ఉంచాలి. దీని నుంచి వచ్చే సువాసనకు ఆకర్షితమైన పురుగులు అందులో పడిపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్