అధిక బరువు తగ్గితే..!

అధిక బరువు.. చాలామందికి ఓ పెద్ద సమస్య ఇది.. ఈ నేపథ్యంలో తాము కోరుకున్న సంఖ్య వెయింగ్ స్కేల్‌పై కనిపించేవరకూ కష్టపడుతూనే ఉంటారు. ఇందుకోసం కొందరు విభిన్న రకాల డైట్లను ఫాలో అయితే, మరికొందరేమో చెమటోడ్చి వ్యాయామాలు చేస్తుంటారు. మంచి పోషకాహారం, చక్కటి వ్యాయామం ఈ రెండూ....

Published : 26 Nov 2022 18:21 IST

అధిక బరువు.. చాలామందికి ఓ పెద్ద సమస్య ఇది.. ఈ నేపథ్యంలో తాము కోరుకున్న సంఖ్య వెయింగ్ స్కేల్‌పై కనిపించేవరకూ కష్టపడుతూనే ఉంటారు. ఇందుకోసం కొందరు విభిన్న రకాల డైట్లను ఫాలో అయితే, మరికొందరేమో చెమటోడ్చి వ్యాయామాలు చేస్తుంటారు. మంచి పోషకాహారం, చక్కటి వ్యాయామం ఈ రెండూ మన శరీరం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చాలామంది ఈ మార్గంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతారు. ఈ క్రమంలో బరువు తగ్గామో లేదో తెలుసుకోవడానికి మాటిమాటికీ వెయింగ్ మెషీన్‌తోనే చెక్ చేసుకోవక్కర్లేదు. బరువు తగ్గితే అది కొన్ని లక్షణాల ద్వారా కూడా తెలుస్తుందంటున్నారు నిపుణులు..

ఎనర్జిటిక్‌గా..

బరువు తగ్గడానికి మీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మీరు ఎలా ఫీలయ్యేవారో మీకు తెలుసు. అక్కడి నుంచి ప్రారంభించి క్రమంగా ఒక్కో కేజీ తగ్గిన కొద్దీ శరీరం తేలికవుతున్న భావన కలుగుతుంది. అధిక బరువు తగ్గినప్పుడు శరీరం, మనసు రెండూ ఉత్సాహంగా ఉంటాయి. ఎనర్జిటిక్‌గా ఫీలవుతాం. బద్ధకం, నిస్తేజం.. లాంటివి దరి చేరవు.

ఆరోగ్య సమస్యలు దూరం..

అధిక బరువు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ తరహా సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. థైరాయిడ్, పీసీఓడీ వంటివి అధిక బరువు ఉన్నవారిలోనే ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి తోడు జీవనశైలికి సంబంధించిన సమస్యలు ఉండనే ఉంటాయి. వీటితో పాటు నిద్రపట్టకపోవడం, ఆయాసం, కీళ్ల నొప్పులు వంటివి కూడా కనిపిస్తాయి. అయితే బరువు తగ్గితే ఈ సమస్యలన్నీ దూరమవుతాయి. డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా అదుపులోకి వస్తాయి.

జీవక్రియలు సవ్యంగా..

బరువు అధికంగా ఉన్నప్పుడు మన శరీరంలో జీవక్రియలు నెమ్మదిగా జరుగుతుంటాయి. అదే బరువు తగ్గుతున్న కొద్దీ జీవక్రియల వేగం పెరుగుతుంది.. దీనివల్ల ఆహారం వేగంగా జీర్ణమవడమే కాదు.. క్యాలరీలు కూడా ఎక్కువగా ఖర్చవుతాయి. తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. సమయానుగుణంగా ఆకలవుతోందంటే అది మన బరువు తగిన స్థాయికి చేరుకుందని భావించేందుకు ఓ సూచనగా చెప్పుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని