పిల్లల్లో సున్నితత్వాన్ని దూరం చేయండిలా..!

పిల్లలు సాధారణంగానే చాలా సున్నిత మనస్కులు. కొందరు పిల్లలైతే మరీనూ..! కాస్త గట్టిగా మాట్లాడితే చాలు.. నీళ్ల కుండ తలమీదే పెట్టుకున్నట్లు జలజలా కన్నీరు కార్చేస్తారు. ఇలాంటి స్వభావం ఉండే పిల్లలతో చాలా జాగ్రత్తగా మెలగాలి, మాట్లాడాలి. లేదంటే వారిలో ఒత్తిడి పెరిగి అది వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి మీ పిల్లలు కూడా సున్నిత మనస్కులా?? అయితే వాళ్లతో ఎలా మెలగాలి? తెలుసుకుందాం రండి..

Updated : 14 Aug 2021 21:12 IST

పిల్లలు సాధారణంగానే చాలా సున్నిత మనస్కులు. కొందరు పిల్లలైతే మరీనూ..! కాస్త గట్టిగా మాట్లాడితే చాలు.. నీళ్ల కుండ తలమీదే పెట్టుకున్నట్లు జలజలా కన్నీరు కార్చేస్తారు. ఇలాంటి స్వభావం ఉండే పిల్లలతో చాలా జాగ్రత్తగా మెలగాలి, మాట్లాడాలి. లేదంటే వారిలో ఒత్తిడి పెరిగి అది వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి మీ పిల్లలు కూడా సున్నిత మనస్కులా?? అయితే వాళ్లతో ఎలా మెలగాలి? తెలుసుకుందాం రండి..

తగిన ప్రోత్సాహం..

ప్రస్తుతం వేగంగా దూసుకుపోతున్న టెక్నో యుగంలో 'మేం నెమ్మదిగా ఉంటాం..' అంటే కుదరని పని. ఇలా ఉంటే వెనకబడిపోయే అవకాశం కూడా ఉంది. అలాగని మీ పిల్లల సున్నిత స్వభావంలో తక్షణం మార్పు తీసుకురాలేరు. కాబట్టి వారిలో ఆ గుణాన్ని ఎత్తి చూపకుండా నెమ్మదిగా మార్చే ప్రయత్నం చేయడం మంచిది. ఈ క్రమంలో పిల్లలకు ఎలాంటి క్లిష్ట పరిస్థితులెదురైనా మేము మీ వెన్నంటే ఉన్నామన్న భరోసా వారికి ఇవ్వాలి.

భయాన్ని పోగొట్టండి..

సున్నిత మనస్కులు ఏ విషయంలోనైనా చాలా త్వరగా భయపడతారు. ఉదాహరణకి వారికి మ్యాథ్స్ సబ్జెక్టు అంటే భయమనుకోండి. అందులో ఉండే సమస్యలు సాధించడానికి పిల్లలు వెనకడుగు వేస్తుంటే.. మీరే ముందుండి ఆ సమస్యలను సులభమైన పద్ధతుల్లో ఎలా పరిష్కరించవచ్చో వారికి వివరించాలి. ఇలా ప్రతి విషయంలోనూ వారిలో ఉండే భయాన్ని పోగొట్టి.. ధైర్యాన్ని నింపే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది.

ముందు సింగిల్‌గా..

సున్నిత స్వభావం ఉండే పిల్లలు ఎక్కువ మందిలో మాట్లాడటానికి, కలిసి ఏ పనైనా చేయడానికి ముందడుగు వేయకపోవచ్చు. కాబట్టి ముందుగా వాళ్లకు.. పుస్తకాలు చదవడం, సృజనాత్మకత పెంచే పనుల్లో వాళ్లని నిమగ్నం చేయడం.. ఇలా ఒంటరిగా చేసే పనుల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. తర్వాత నెమ్మదిగా గ్రూప్ యాక్టివిటీలకు హాజరయ్యేలా చూడాలి. దీంతో వాళ్లు వాళ్లలో ఉండే సున్నిత స్వభావం క్రమంగా దూరమయ్యే అవకాశం ఉంది.

ప్రశంస మంచిదే..

సెన్సిటివ్‌గా ఉండే పిల్లలు ఏ పని చేసినా.. అదెలా ఉన్నా.. ప్రశంసించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్లను నిరుత్సాహపరిస్తే లోలోపలే కుంగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రశంసలతోనే వాళ్లలో ఉన్న సున్నితత్వాన్ని పోగొట్టి.. తోటి పిల్లల్లా యాక్టివ్‌గా మారేలా చేయచ్చు.

బహుమతులతో...

సున్నిత మనస్తత్వం కలిగిన పిల్లలకు 'నువ్వు ఇందులో విజయం సాధిస్తే నీకు ఫలానా బహుమతిస్తా..' అంటూ వారిలో ప్రోత్సహించాలి. తద్వారా వారిలో ఆ పని చేయాలన్న తపన, పట్టుదల పెరుగుతాయి. వారిలో సున్నితత్వాన్ని దూరం చేయడానికి ఇదీ ఓ మార్గమే.!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్