Published : 17/10/2022 15:15 IST

వారానికోసారైనా ఇలా చేయాలట!

రోజూ అందం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే సమయం ఉండకపోవచ్చు. కానీ వారానికి ఒక్కసారైనా ఈ విషయాలపై కొంత సమయం  కేటాయించాలంటున్నారు నిపుణులు.

వారానికి ఒక్కసారైనా హెర్బల్‌ నూనెలతో శరీరానికి మర్దన చేసుకోండి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. చర్మం కాంతిమంతంగా మారుతుంది.

తీరిక దొరికినప్పుడల్లా ముఖంలో పేరుకున్న మృతకణాలను తొలగించుకునేందుకు స్క్రబ్‌ చేసుకుంటాం. అలానే వారానికోసారైనా శరీరం మొత్తానికి అంటే.. వీపు, మెడ, కాళ్లకు కూడా స్క్రబ్‌ అవసరం. డీప్‌ క్లెన్సింగ్‌ మిల్క్‌ని అందుకోసం ఉపయోగించచ్చు. పాలు, పంచదార వంటి.. సహజసిద్ధమైన పదార్థాలనూ వాడచ్చు.

చర్మంపై మృతకణాలు పోయి నిగారింపు రావాలంటే కనీసం అప్పుడప్పుడు ముఖానికి ఫేషియల్‌ అవసరం. అలాగని పార్లర్‌కే వెళ్లాలని లేదు. ఇంట్లో పండ్ల గుజ్జుతో కూడా ప్యాక్‌లు వేసుకోవచ్చు. తద్వారా ట్యాన్‌ పోయి ముఖం తాజాగా కనిపిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని