పుట్టే బిడ్డల్లో అవయవ లోపాలు ఎందుకొస్తాయి?

నమస్తే మేడం. నా వయసు 26. పెళ్లై ఆరేళ్లయింది. నాకు 4 ఏళ్ల బాబున్నాడు. ఈమధ్యే మళ్లీ బాబు పుట్టాడు.

Updated : 24 Dec 2021 19:24 IST

నమస్తే మేడం. నా వయసు 26. పెళ్లై ఆరేళ్లయింది. నాకు 4 ఏళ్ల బాబున్నాడు. ఈమధ్యే మళ్లీ బాబు పుట్టాడు. అయితే మా రెండో బాబు రెండు చెవులు, ఒక ముక్కు రంధ్రం మూసుకుపోయి పుట్టాడు. కిడ్నీలో వాపుందని, గుండె సమస్య కూడా ఉందని చెప్పారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోలేకపోతున్నాడని ఆక్సిజన్‌ పెట్టే ఉంచారు. ఇక ఐదు రోజులకు ఇంటికి తీసుకొచ్చాక చనిపోయాడు. అసలు ఇలా బిడ్డ అవయవ లోపంతో పుట్టడానికి ఏవైనా కారణాలున్నాయా? దీని ప్రభావం మరో ప్రెగ్నెన్సీపై ఏమైనా ఉంటుందా? దయచేసి సలహా ఇవ్వండి.- ఓ సోదరి

జ: మీ రెండో బాబు దురదృష్టవశాత్తూ చనిపోయాడంటే అందుకు పుట్టుకతోనే వచ్చే అనేక లోపాలు కారణం అని అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ముక్కు, చెవులు, కిడ్నీ, గుండె.. వీటన్నింటిలో తేడాలున్నాయని రాశారు. మరి ఇవన్నీ గమనించినప్పుడు.. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు గానీ, బాబు పుట్టాక గానీ.. మీకు, బాబుకి ఎలాంటి పరీక్షలైనా జరిగాయా? మామూలుగా పుట్టుకతోనే వచ్చే అవయవ లోపాలు క్రోమోజోముల్లో గానీ, జీన్స్‌లో గానీ లోపాలుంటే వస్తాయి. బిడ్డను వివరంగా పరీక్షించడం ద్వారా వివిధ రకాల సిండ్రోమ్స్‌ని కూడా గుర్తిస్తారు. మీకు తర్వాతి ప్రెగ్నెన్సీ గురించి అవగాహన కావాలంటే ఈ బాబు వివరాలన్నీ తీసుకొని జెనెటిక్‌ కౌన్సెలింగ్‌కి వెళ్లాలి. అప్పుడే పుట్టబోయే బిడ్డకు ఇలా జరగడానికి ఎంత శాతం అవకాశం ఉంటుంది? అదీ మీరు గర్భవతిగా ఉండగా మొదటి లేదా రెండో త్రైమాసికంలోనే గుర్తించగలుగుతామా?.. వంటి విషయాలన్నీ మీకు చెప్పగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్