Beauty: ఫేషియల్‌ చేయించుకున్నారా...

ముఖాన్ని మెరిపించాలని... చాలామంది ఫేషియల్‌ చేయించుకుంటారు. తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం... చర్మం నిర్జీవంగా మారుతుంది. మరిన్ని సమస్యలనూ ఎదుర్కోవాలి. అలాకాకూడదంటే...

Updated : 21 Feb 2024 15:06 IST

ముఖాన్ని మెరిపించాలని... చాలామంది ఫేషియల్‌ చేయించుకుంటారు. తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం... చర్మం నిర్జీవంగా మారుతుంది. మరిన్ని సమస్యలనూ ఎదుర్కోవాలి. అలాకాకూడదంటే...

* ఫేషియల్‌ చేయించుకున్నాక చర్మం సున్నితంగా మారుతుంది. ఆ సమయంలో ఎండలోకి వెళ్లడం, కాలుష్య ప్రభావానికి గురికావడం మంచిది కాదు. పగటి పూట ఫేషియల్‌ చేయించుకున్నాక బయటకు వెళ్లాల్సి వస్తే మెత్తని స్కార్ఫ్‌ని ముఖానికి చుట్టుకోవాలి. లేదంటే సాయంత్రం చేయించుకోవడం మంచిది.

* పొడి చర్మతత్వం వారు ఫేషియల్‌ చేయించుకోవడం వల్ల ముఖం మరింత పొడిబారే ప్రమాదం ఉంది. అందుకే, బ్లీచ్‌ వంటివాటి జోలికి వెళ్లకుండా హైడ్రేటెడ్‌ రకాల్ని ఎంచుకుంటే మేలు. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. కీరదోస, బంగాళాదుంప వంటివాటిని స్లైసుల్లా తరిగి ముఖం మీద పెట్టుకోవాలి. వీటి వల్ల చర్మం పొడి బారదు. తేమ అంది మృదువుగా మారుతుంది.

* ఫేషియల్‌ చేయించుకున్న 3, 4 రోజుల వరకూ కొత్త రకాల సౌందర్యోత్పత్తులు వాడకపోవడం మంచిది. ఫేషియల్‌ తరవాత చర్మం సున్నితంగా మారుతుంది. అలాంటప్పుడు ఏవైనా రసాయనాలు పడకపోతే చర్మానికి నష్టం కలుగుతుంది.

* ఈతకొట్టడం, ఎక్కువ సార్లు ముఖం కడుక్కోవడం వంటివి చేయకూడదు. క్లోరైడ్‌ నీళ్లు చర్మానికి హానిచేయొచ్చు. అలానే సబ్బు, ఇతర క్రీములు కూడా ఒక రోజంతా రాసుకోవద్దు.

* చేతులతో చర్మాన్ని తాకడం, ముఖం కడుక్కున్నప్పుడు తువాలుతో బలంగా రుద్దుకోవడం వంటివీ చేయకూడదు. కేవలం నీళ్లని ముఖం మీద చల్లుకుని మెత్తని తువాలుతో అద్దుకోవాలంతే. అలానే ఐసు ముక్కలతోనూ అప్పుడప్పుడూ రుద్దుతుంటే కందిపోవడం, దద్దుర్లు రావు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్