శ్యానిటరీ న్యాప్‌కిన్స్‌ వల్ల దురద.. పరిష్కారమేంటి?

హలో మేడమ్.. నాకు పిరియడ్స్‌ సమయంలో శ్యానిటరీ న్యాప్‌కిన్స్‌ వాడితే దురద వస్తోంది. మూడు నాలుగ్గంటలకోసారి ప్యాడ్‌ మార్చుకుని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, క్రీమ్‌ వాడినా ఇలాగే జరుగుతోంది. గత ఐదు నెలలుగా నాది.....

Published : 28 Jul 2022 20:55 IST

హలో మేడమ్.. నాకు పిరియడ్స్‌ సమయంలో శ్యానిటరీ న్యాప్‌కిన్స్‌ వాడితే దురద వస్తోంది. మూడు నాలుగ్గంటలకోసారి ప్యాడ్‌ మార్చుకుని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, క్రీమ్‌ వాడినా ఇలాగే జరుగుతోంది. గత ఐదు నెలలుగా నాది ఇదే పరిస్థితి. దీనికేదైనా పరిష్కార మార్గం ఉంటే సూచించండి.. - ఓ సోదరి

జ: మీ సమస్యకు రెండు రకాల కారణాలుండచ్చు. మొదటిది - మీరు ఈ మధ్య శ్యానిటరీ న్యాప్‌కిన్స్‌ బ్రాండ్‌ మార్చి ఉంటే కొత్త దాని వల్ల మీకు అలర్జీ వచ్చి ఉండచ్చు. రెండోది - నిరంతరాయంగా రోజుల తరబడి ప్యాడ్స్‌ వాడుతున్నప్పుడు గాలి తగలక చర్మ వ్యాధులు రావడం.. అందులోనూ ముఖ్యంగా ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు రావడం వంటివి జరగచ్చు. అయితే దీన్నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

మొదటిది - మీరు క్రీమ్‌ వాడుతున్నానన్నారు.. క్రీమ్‌ బదులుగా యాంటీ ఫంగల్‌ డస్టింగ్‌ పౌడర్‌ దొరుకుతుంది.. చర్మం పైన ఆ పౌడర్‌ వాడి ఆపై ప్యాడ్‌ పెట్టుకుంటే అది తడిని త్వరగా పీలుస్తుంది.

రెండోది - ప్యాడ్స్‌ తరచుగా మార్చుకోవడం.

మూడోది - మీరు నీటితో శుభ్రం చేసుకున్నప్పుడు తడి లేకుండా ముందు ఒక టిష్యూతో కానీ లేదా న్యాప్‌కిన్‌తో కానీ పొడిగా శుభ్రం చేసుకొని ఆ తర్వాత ప్యాడ్‌ పెట్టుకోవడం.

వీటితో కూడా ఉపశమనం కలగకపోతే మీరు ఒకసారి డెర్మటాలజిస్ట్‌ని సంప్రదిస్తే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని