Published : 13/12/2022 21:47 IST

వెచ్చవెచ్చటి హెల్దీ సూప్!

అటు వేడివేడిగా కడుపు నింపుతూనే, ఇటు ఫిట్‌నెస్‌ని కూడా కోల్పోకుండా ఉండాలంటే ఈ చలికాలంలో కొన్ని సూప్స్‌ ట్రై చేయడం బెటర్. అలాంటిదే ఈ సూప్!

బాదం- మష్రూమ్ సూప్

కావాల్సినవి :

బాదంపప్పులు - అరకప్పు

పాలు - అరకప్పు

మష్రూమ్స్‌ - 50 గ్రాములు

వెన్న - 2 టేబుల్‌ స్పూన్లు

మైదా - 4 టేబుల్‌ స్పూన్లు

నీళ్లు - 4 కప్పులు

ఉప్పు - 2 టేబుల్‌ స్పూన్లు

మిరియాల పొడి - పావు చెంచా

క్రీమ్‌ - 4 టేబుల్‌ స్పూన్లు

తయారీ :

నానబెట్టిన బాదంపప్పుల్లో కొన్నింటిని తీసుకొని మీడియం సైజులో తరిగి పక్కన పెట్టుకోవాలి. మిగతా బాదంపప్పులను పాలలో వేసి బాగా కలిసిపోయేలా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ప్యాన్‌లో వెన్న వేసి తరిగిన బాదంపప్పులు, మష్రూమ్స్‌ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మైదా వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మిశ్రమాన్ని కలుపుతుండాలి. ఈక్రమంలో మైదా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మంట తగ్గించుకొని ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న బాదం పాలను దీనికి చేర్చుకోవాలి. దీనికి సరిపోయేంత ఉప్పు, మిరియాల పొడి చేర్చి అయిదు నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఈ క్రమంలో ఉండలు కట్టకుండా మధ్యమధ్యలో కలుపుతుండాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత దించి క్రీమ్‌ కలుపుకుంటే టేస్టీగా ఉండే బాదం సూప్‌ రడీ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని