SERB Award: వారి పరిశోధనలకు ప్రోత్సాహకాలు!
శాస్త్ర సాంకేతిక రంగాల్ని ఎంచుకునే అమ్మాయిల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. అయితే కొంతమంది మాత్రం ఇలాంటి అరుదైన రంగాల్ని ఎంచుకొని సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో కొత్త కొత్త అధ్యయనాలు/ప్రయోగాలు చేస్తూ తెలియని విషయాలెన్నో తెలియచెప్తున్నారు. అలాంటి మహిళా శాస్త్రవేత్తల్ని ప్రోత్సహించేందుకు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (SERB) ఏటా
(Photo: LinkedIn)
శాస్త్ర సాంకేతిక రంగాల్ని ఎంచుకునే అమ్మాయిల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. అయితే కొంతమంది మాత్రం ఇలాంటి అరుదైన రంగాల్ని ఎంచుకొని సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో కొత్త కొత్త అధ్యయనాలు/ప్రయోగాలు చేస్తూ తెలియని విషయాలెన్నో తెలియచెప్తున్నారు. అలాంటి మహిళా శాస్త్రవేత్తల్ని ప్రోత్సహించేందుకు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (SERB) ఏటా ‘విమెన్ ఎక్స్‌లెన్స్ అవార్డు’ల పేరిట ప్రోత్సాహకాలు అందిస్తుంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది పది మంది మహిళలు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. మరి, వాళ్లెవరు? శాస్త్ర సాంకేతిక రంగాల్లో వారు చేస్తోన్న కృషి ఏంటో తెలుసుకుందాం రండి..
SERB విమెన్ ఎక్స్‌లెన్స్ అవార్డు.. 40 ఏళ్లలోపు మహిళా శాస్త్రవేత్తలకు ఇచ్చే ప్రోత్సాహక పురస్కారమిది! అయితే కొన్ని జాతీయ విద్యా సంస్థల నుంచి ‘యంగ్ సైంటిస్ట్ మెడల్’, ‘యంగ్ అసోసియేట్’.. వంటి గుర్తింపు పొందిన వారే ఈ అవార్డుకు అర్హులు. ఈ క్రమంలో ఈ పురస్కారానికి ఎంపికైన మహిళా శాస్త్రవేత్తలకు వారి పరిశోధన ప్రాజెక్టుల్ని ప్రోత్సహించడానికి మూడేళ్ల పాటు రీసెర్చ్ గ్రాంట్ పేరిట ఏటా రూ. 5 లక్షల నగదును బహూకరిస్తారు. ఇలా ఈ అవార్డుకు ఈ ఏడాది పది మంది మహిళా సైంటిస్టులు ఎంపికయ్యారు.
రుతా కలే
అంతరిక్షం.. అదో నిగూఢ రహస్యం. నిజానికి దీని గురించి మనకు తెలిసింది గోరంత. తెలియాల్సింది కొండంత. అలాంటి అంతులేని అంతరిక్షంపై పరిశోధనలు సాగిస్తున్నారు పుణేకు చెందిన రుతా కలే. నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ (NCRA)లో ఫ్యాకల్టీగా, శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. రేడియో గెలాక్సీల గుట్టు విప్పడమే లక్ష్యంగా వీటిపై పరిశోధనలు సాగిస్తున్నారు. రేడియో గెలాక్సీ అంటే.. ప్రస్తుతం మనమున్న గెలాక్సీ కంటే మిలియన్ రెట్లు ఎక్కువ రేడియో తరంగాలు ఉద్గారం చేస్తుంది. ఈ క్రమంలోనే రేడియో గెలాక్సీల పరిణామ క్రమం, రేడియో ఖగోళ శాస్త్ర సాంకేతికతలపై అధ్యయనం కొనసాగిస్తున్నారు రుతా కలే. బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో పీహెచ్డీ పూర్తి చేసిన ఈ మహిళా శాస్త్రవేత్త.. 2015-2020 వరకు DST-INSPIRE ఫ్యాకల్టీ ఫెలోషిప్ అందుకున్నారు.
ఆశా ఎస్కే
CSIR-నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో ‘పాలిమర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్’ విభాగానికి అధినేత్రిగా, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా కొనసాగుతున్నారు ఆశా ఎస్కే. ఆమె ఆధ్వర్యంలో పనిచేస్తోన్న పరిశోధన బృందం.. లేజర్, ఫొటో డయోడ్లు, సౌర ఘటాలు, ఎల్ఈడీ.. వంటి ఆప్టో ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే పాలిమర్ నిర్మాణాలపై పరిశోధనలు సాగిస్తోంది. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పాలిమర్ రసాయనశాస్త్రం విభాగంలో పీహెచ్డీ చేసిన ఆశ.. 2018నుంచి ‘మ్యాక్రో మాలిక్యూల్స్’ విభాగానికి ఎడిటోరియల్ అడ్వైజరీ బోర్డ్ సభ్యురాలిగానూ కొనసాగుతున్నారు.
యోగితా అద్లకా
మెదడు/నాడులకు సంబంధించిన రుగ్మతలు/లోపాల్ని అర్థం చేసుకోవడానికి, వాటి కోసం తయారుచేసిన మందుల పనితీరును తెలుసుకోవడానికి దశాబ్దాల నుంచి జంతు నమూనాల్నే ఉపయోగిస్తున్నారు. అయితే ఈ క్లినికల్ ట్రయల్స్‌లో సక్సెస్ శాతం కంటే ఫెయిల్యూర్ శాతమే ఎక్కువని చెబుతున్నాయి అధ్యయనాలు! ఈ అంతరాన్ని తొలగించడానికి నడుం బిగించింది ఫరీదాబాద్‌కు చెందిన డాక్టర్ యోగితా అద్లకా. ఆటిజం వంటి మెదడు సంబంధిత సమస్యల్ని అర్థం చేసుకోవడానికి, వాటికి సమర్థమైన చికిత్సను అందించడానికి మానవ ఆధారిత స్టెమ్ సెల్ నమూనాల్ని అభివృద్ధి చేస్తోందామె. ప్రస్తుతం అక్కడి ‘ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్’లో శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తోన్న యోగిత.. ఈ అధ్యయనం కోసం తన బృందంతో కలిసి పనిచేస్తోంది. మెదడు ఎలా అభివృద్ధి చెందుతుంది, ముఖ్యంగా నాడులు-మెదడు అభివృద్ధి చెందే సమయంలో తలెత్తే లోపాలు, ఫలితంగా ఏకాగ్రత-ప్రవర్తన లోపాలు, భాషలో బలహీనత.. వంటి వాటిపై తన అధ్యయనంలో భాగంగా దృష్టి పెడుతోంది యోగిత.
నితికా సంధు
పంటలకు నీళ్లే మూలం. అదే వర్షాలు పడక, నీటి సదుపాయం సరిగ్గా లేని ప్రాంతాల్లో పంటలు పండక కరవు కాటకాలే తాండవిస్తుంటాయి. అయితే ఇలాంటి గడ్డు పరిస్థితుల్ని అధిగమించడమే లక్ష్యంగా పెట్టుకుంది పంజాబ్‌కు చెందిన డాక్టర్ నితికా సంధు. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేస్తోన్న ఆమె.. కరవును తట్టుకొనే వరి రకాలు, స్వీయ పరాగసంపర్కం ద్వారా పంట ఉత్పత్తిని పెంచే మొక్కల రకాలపై అధ్యయనం సాగిస్తోంది. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరక ముందు ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలో పనిచేసిన ఆమె.. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ అందుకుంది. మొక్కలపై ఆమె చేస్తోన్న అధ్యయనాలకు గుర్తింపుగా 2020లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా (NASI) ఆమెను ప్రతిష్ఠాత్మక ‘యంగ్ సైంటిస్ట్ ప్లాటినం జూబ్లీ అవార్డు’తో సత్కరించింది.
వీరితో పాటు..
* ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ (ICGEB)లో లైఫ్ సైన్సెస్ విభాగంలో పరిశోధనలు చేస్తోన్న అషిమా భాస్కర్,
* ‘CSIR-సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్’ లో పనిచేస్తోన్న నేహా ఖత్రి,
* ఐఐటీ హైదరాబాద్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న ముద్రికా ఖండేవాల్ (ఇంజినీరింగ్ విభాగం),
* ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో శాస్త్రవేత్త అయిన ఛాందిని యు (ఫిజికల్ సైన్సెస్ విభాగం),
* దిబ్రుగర్ యూనివర్సిటీలో పనిచేస్తోన్న వినితా పాథక్ (భూమి, వాతావరణ శాస్త్రం),
* ఎన్ఐటీ- సూరత్కల్ కు చెందిన దెబాశ్రీ చక్రవర్తి (రసాయన శాస్త్రం).. తదితరులు SERB ప్రోత్సాహక పురస్కారం అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!