గోల్ఫ్‌లో అద్భుతాలు సృష్టిస్తోంది!
‘ఆసక్తి ఉన్న రంగాల్లో అమ్మాయిల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరు..’ పదిహేనేళ్ల అవనీ ప్రశాంత్ ఈ మాటల్ని అక్షర సత్యం చేసి చూపిస్తోంది. పసి వయసు నుంచే గోల్ఫ్ క్రీడపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. టీనేజ్‌లోకి ప్రవేశించకముందే పదుల సంఖ్యలో ట్రోఫీలు గెలుచుకుంది. ఓవైపు చదువు కొనసాగిస్తూనే.. మరోవైపు గోల్ఫ్ క్రీడలో జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో రాణిస్తోంది.
(Photo: Instagram)
‘ఆసక్తి ఉన్న రంగాల్లో అమ్మాయిల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరు..’ పదిహేనేళ్ల అవనీ ప్రశాంత్ ఈ మాటల్ని అక్షర సత్యం చేసి చూపిస్తోంది. పసి వయసు నుంచే గోల్ఫ్ క్రీడపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. టీనేజ్‌లోకి ప్రవేశించకముందే పదుల సంఖ్యలో ట్రోఫీలు గెలుచుకుంది. ఓవైపు చదువు కొనసాగిస్తూనే.. మరోవైపు గోల్ఫ్ క్రీడలో జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో రాణిస్తోంది. ఇలా గోల్ఫ్‌లో తాను సాధించిన విజయాలకు గుర్తింపుగా తాజాగా ‘గ్లోబల్ ఛైల్డ్ ప్రాడిజీ అవార్డ్ - 2022’కి ఎంపికైందామె. జీవితానికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలు నేర్పించే ఈ ఆటలో అమ్మాయిల్ని ప్రోత్సహించడమే తన లక్ష్యమంటోన్న ఈ యంగ్ గోల్ఫర్ జర్నీలోని కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..
అవనీ ప్రశాంత్.. బెంగళూరులోని గ్రీన్వుడ్స్ ఇంటర్నేషనల్ హైస్కూల్లో చదువుకుంటోంది. చదువులో చురుగ్గా ఉండే ఆమెకు గోల్ఫ్ క్రీడంటే చిన్నతనం నుంచే ఆసక్తి. ఈ క్రమంలోనే నాలుగేళ్ల వయసులోనే గోల్ఫ్ క్లబ్ (స్టిక్) చేతపట్టి సాధన చేయడం మొదలుపెట్టింది. ఇలా తన ఇష్టాన్ని తన తండ్రికి చేరవేసిందామె.
‘ఆడగలనా?’ అని సందేహించాడు!
అవని తండ్రి ఎంఎస్ ప్రశాంత్ కూడా గోల్ఫ్ క్రీడాకారుడే! ఈ క్రమంలోనే తన కూతురి ఇష్టాన్ని తెలుసుకున్న ఆయన ముందు తను ఆడగలుగుతుందో లేదోనని సందేహించినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం పూర్తి నమ్మకంతో ఆమెను ఈ దిశగా ప్రోత్సహించారు. కోచ్ దగ్గర ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.
‘నాకు ఊహ తెలిసినప్పట్నుంచి గోల్ఫే నా బెస్ట్ ఫ్రెండ్. స్వతహాగా గోల్ఫర్ అయిన నాన్నను చూసి ఈ క్రీడను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నా. ఇక శిక్షణ సమయంలో అబ్బాయిల కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచేదాన్ని. నా ఆరేళ్ల వయసులో ‘కిడ్స్ గోల్ఫ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్’ ద్వారా తొలిసారి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ట్రోఫీ గెలుచుకున్నా. ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఆ తర్వాత జరిగిన పలు క్రీడా పోటీల్లోనూ మంచి ప్రతిభ కనబరిచా. దీంతో నా నైపుణ్యాల్ని మెరుగుపరచుకోవడానికి మరింత సమయం కేటాయించడం మొదలుపెట్టా..’ అని చెబుతోంది అవని.
ప్రతిభకు దక్కిన స్కాలర్షిప్!
పట్టుమని పదమూడేళ్లు కూడా నిండక ముందే వందకు పైగా టోర్నమెంట్లలో పాల్గొన్న ఈ యంగ్ గోల్ఫర్ 88కి పైగా ట్రోఫీల్ని తన వశం చేసుకుంది. ఇక ఇటీవలే నోయిడా గోల్ఫ్ క్లబ్లో జరిగిన ‘ఆలిండియా లేడీస్ అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్’లో స్ట్రోక్ ప్లే, మ్యాచ్ ప్లే టోర్నమెంట్లలో గెలుపొంది.. ఈ రెండు టోర్నమెంట్లలో గెలుపొందిన.. అతి పిన్న క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచింది అవని. ఇలా గోల్ఫ్‌లో తన మెరుగైన ప్రదర్శనతో 2019లో ‘విరాట్ కోహ్లీ ఫౌండేషన్’ అందించే విరాట్ కోహ్లీ స్కాలర్షిప్ కూడా గెలుచుకుందీ గోల్ఫర్ టీన్. క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చేసే బాలబాలికలను ఎంపికచేసి మూడేళ్ల పాటు ఈ ఉపకార వేతనం అందిస్తారు. అలాంటి వారి నైపుణ్యాలకు పదును పెట్టి వారిని అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ఈ స్కాలర్షిప్ లక్ష్యం.
ఫిట్‌గా ఉండాల్సిందే!
గోల్ఫ్ ఆడే క్రమంలో Eye-Hand Coordination ని బాగా మెయింటెయిన్ చేసే అవని.. ఏ క్రీడలోనైనా రాణించాలంటే ఫిట్‌గా ఉండడం ముఖ్యమంటోంది. ‘గోల్ఫే కాదు.. ఫుట్‌బాల్ అన్నా నాకు ఇష్టమే. అయితే దీన్ని నా ఫిట్నెస్ మెరుగుపరచుకోవడానికి ఆడుతుంటా. ఫుట్‌బాల్ వల్ల నా శరీర కింది భాగాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. చురుగ్గా కదలగలుగుతా. అయితే ఈ క్రీడలో గాయాల బెడద కూడా ఎక్కువేనని, వీలైనంతగా దీన్ని పక్కన పెట్టమని నా కోచ్ రెండేళ్ల క్రితం సలహా ఇచ్చారు. ఈ క్రమంలో ఫిట్నెస్ కోసం మరికొన్ని వ్యాయామాలు చేస్తుంటా.. తీసుకునే ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తా. ముఖ్యంగా శారీరక దృఢత్వం, బలాన్ని పెంపొందించే పోషకాహారానికే ప్రాధాన్యమిస్తా. ఇక రోజుకు ఐదు గంటల పాటు గోల్ఫ్ సాధన చేయడం నాకు అలవాటు.. ఎందుకంటే ఎంత ఎక్కువగా సాధన చేస్తే అందులో అంత పర్ఫెక్ట్ అవగలం!’ అంటోంది అవని.
‘బాల మేధావి’గా అవార్డు!
పిన్న వయసులోనే గోల్ఫ్ క్రీడలో దూసుకుపోతూ అద్భుతాలు సృష్టిస్తోన్న అవని.. తాజాగా ‘గ్లోబల్ ఛైల్డ్ ప్రాడిజీ అవార్డు - 2022’కి ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న రంగాల్లో (క్రీడలు, కళలు, సంగీతం, నృత్యం, మోడలింగ్, నటన, సైన్స్.. మొదలైనవి) తమదైన ప్రతిభ కనబరుస్తోన్న వందమందికి ఏటా ఈ అవార్డులు అందిస్తుంటారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్ వేదికగా జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డు అందుకోనుందీ యంగ్ గోల్ఫర్. ఈ నేపథ్యంలో 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం నెగ్గడమే తన లక్ష్యమంటోంది అవని.
క్రీడ కాదు.. పాఠం!
‘రాబోయే టోర్నమెంట్లలో బంగారు పతకాల వేటే లక్ష్యంగా పెట్టుకున్నా. ముఖ్యంగా 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా. అందులో పసిడి చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతోనే సాధన చేస్తున్నా. గోల్ఫ్ అనేది కేవలం క్రీడే కాదు.. అది మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఓపిక, క్రమశిక్షణ, శారీరక-మానసిక దృఢత్వం, చిత్తశుద్ధి.. వంటివి ఈ క్రీడ ద్వారా మనకు అలవడతాయి. ప్రస్తుతం ఈ క్రీడలో అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితి మారేలా బాలికల్లో స్ఫూర్తి నింపాలనుకుంటున్నా..’ అంటూ తన భవిష్యత్తు లక్ష్యాల గురించి బయటపెట్టిందీ యువ అథ్లెట్.
ఆల్ ది బెస్ట్ అవని!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!