Indonesia: ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 127 మంది దుర్మరణం

ఇండోనేషియాలో ఘోరం చోటుచేసుకుంది. ఫుట్‌బాల్‌ మైదానంలో తొక్కిసలాట జరగడంతో 127 మంది దుర్మరణం పాలయ్యారు.

Updated : 02 Oct 2022 07:24 IST

జకర్తా: ఇండోనేషియాలో ఘోరం చోటుచేసుకుంది. ఫుట్‌బాల్‌ మైదానంలో తొక్కిసలాట జరగడంతో 127 మంది దుర్మరణం పాలయ్యారు. తూర్పు జావా ప్రావిన్స్‌లో శనివారం రాత్రి నిర్వహించిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మరో 180 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. 

ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో అరెమా జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల అభిమానులు ఘర్షణకు దిగారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. దీంతో ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ ప్రయోగించి లాఠీఛార్జ్‌ చేశారు. ఈ ఘటనపై ఇండోనేషియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ దర్యాప్తునకు ఆదేశించింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని