China: అంతిమయాత్ర ఏర్పాట్లలో ట్రక్కు బీభత్సం.. 19 మంది మృతి..!

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో 19మంది దుర్మరణం చెందగా.. 20మంది గాయపడ్డారు. 

Updated : 08 Jan 2023 18:04 IST

ఇంటర్నెట్‌డెస్క్: అంతిమయాత్ర ఏర్పాట్లు చేస్తున్న ప్రదేశంపైకి ఓ ట్రక్కు దూసుకు రావడంతో 19 మంది మృతి చెందిన ఘటన చైనా(China)లోని జియాంగ్సీ ప్రావిన్స్‌లోని నాన్‌చంగ్‌ శివార్లలో చోటు చేసుకొంది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. నాన్‌చంగ్‌ శివార్లలో టాయిలింగ్‌ గ్రామం వద్ద ఓ వ్యక్తి అంతిమ యాత్ర కోసం రోడ్డు పక్కన టెంట్‌ వేశారు. అక్కడ అంతిమయాత్రలో పాల్గొనేందుకు ప్రజలు గుమిగూడి ఉన్న సమయంలో ఓ ప్రయాణికుల ట్రక్కు వారికపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో కనీసం 19 మంది దుర్మరణం చెందగా..  మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు డ్రైవర్‌ నిర్లక్ష్యమా లేదా పొగమంచు కారణమా అనేది తెలియరాలేదు. ప్రమాదం జరిగిన చోట మాత్రం పొగమంచు దారుణంగా ఉండటంతో ఎదుటి వాహనాలు సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొందని సీసీటీవీ పేర్కొంది. ఈ ప్రమాదం జరిగిన గంట తర్వాత నాన్‌చంగ్‌ కౌంటీలో ట్రాఫిక్‌ పోలీసులు డ్రైవింగ్‌ అడ్వైజరీని జారీ చేశారు.

చైనా(China)లో భారీ రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. చైనాలో లూనార్‌ కొత్త సంవత్సర వేడుకలు మొదలు కావడం, కొవిడ్‌ నిబంధనలు సడలించడంతో చాలా మంది ప్రయాణాలు మొదలుపెట్టారు. గత నెల జెంగ్‌ఝూలోని ఓ జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా వందలాది వాహనాలు ఢీకొని గుట్టగా పడిన ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యాయి. అంతకుముందు నెలలో 56 కార్లు పరస్పరం ఢీకొని 17 మంది మరణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని