Noble prize2022: సాహిత్యంలో అనీ ఎర్నాక్స్‌కు నోబెల్‌ పురస్కారం

సాహిత్యం(Literature)లో ఫ్రాన్స్‌కు చెందిన రచయిత్రి అనీ ఎర్నాక్స్‌(Annie Ernaux)కు ప్రపంచ అత్యున్నత నోబెల్‌ పురస్కారం (Nobel Prize 2022) లభించింది.

Updated : 06 Oct 2022 20:39 IST

స్టాక్‌హోం: సాహిత్యం(Literature)లో ఈ ఏడాది నోబెల్‌ పురస్కారం (Nobel Prize 2022) ఫ్రెంచ్‌ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్‌ని వరించింది.  వ్యక్తిగత జ్ఞాపకాల మూలాలను, వైరుధ్యాలను, సామూహిక పరిమితులను ధైర్యంగా సూక్ష్మ పరిశీలనతో తన రచనల్లో బహిర్గత పరిచినందుకు గాను 82 ఏళ్ల ఎర్నాక్స్‌ను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్టు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది. సాహిత్య రంగంలో అనీ ఎర్నాక్స్‌ చేసిన విశేషలను కొనియాడింది.  లైంగిక అంశాలు, గర్భస్రావం, అనారోగ్యం, తన తల్లిదండ్రుల మరణంపై ఆమె ఎలాంటి రాజీలేని రచనలు చేశారని అకాడమీ వెల్లడించింది. ఆమె రాసిన 30 పుస్తకాలు తన జీవితంలోను, తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను ప్రతిబింబించేలా సరళమైన భాషలోనే రాశారని నోబెల్‌ సాహిత్య కమిటీ ఛైర్‌పర్సన్‌ ఆండర్స్‌ ఓల్సోన్‌ ప్రశంసించారు. లింగం, భాష, వర్గం అంశాలపై స్వీయ అనుభవాలతో విభిన్న కోణాల నుంచి విశ్లేషిస్తూ చేసే రచనలతో ఎర్నాక్‌ ప్రసిద్ధిగాంచారు.  

1940లో నార్మాండీలోని యెవెటోట్‌ అనే చిన్న పట్టణంలో ఎర్నాక్స్‌ పుట్టి పెరిగారు. అక్కడే తల్లిదండ్రులతో కలిసి ఓ దుకాణం, కేఫ్‌ను నడిపిన ఎర్నాక్స్‌.. రచయిత్రిగా  సాగించిన ప్రయాణం ఎంత సుదీర్ఘమైనది, కష్టంతో కూడుకున్నది. ఆమె 30కి పైగా సాహిత్య రచనలు చేశారు.ఎర్నాక్స్‌ రచనా శైలిలో అతి భావోద్వేగాలు, విపరీతమైన వర్ణనలు లేవన్నారు ఆండర్స్‌ ఓల్సోన్‌ అన్నారు. లాఫెజ్‌ పేరిట ఎర్నాక్స్‌ రాసిన పుస్తకంలో తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని ఆమె వర్ణించారు. తనకు రచనా శైలి సహజంగానే వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. ‘ద ఇయర్స్‌’ పేరిట రాసిన నవలలో మూడో వ్యక్తిగా తన గురించి ప్రస్తావించిన ఎర్నాక్స్‌.. నేను అని కాకుండా ఆమె పేరుతో రాయడం విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది.

గత కొన్నేళ్లుగా నోబెల్‌ పురస్కారం ఎర్నాక్స్‌కు వస్తుందంటూ ఊహాగానాలు చెలరేగేవి. అయితే, అవి ఇప్పటికి నిజమయ్యాయి. 1901 నుంచి ఇప్పటివరకు 119మందికి సాహిత్య నోబెల్‌ పురస్కారాలు ప్రదానం చేయగా.. ఈ జాబితాలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన 17వ మహిళగా ఎర్నాక్స్‌ నిలవడం విశేషం.  

ఇప్పటివరకు వైద్యం, భౌతిక, రసాయనశాస్త్రాలతో పాటు సాహిత్య నోబెల్‌ బహుమతుల విజేతలను ప్రకటించారు. ఆర్థికరంగం, శాంతి బహుమతులకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించాల్సి ఉంది. నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని