Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా వార్.. 346 మంది చిన్నారులు బలి!
ఉక్రెయిన్‌పై ‘సైనిక చర్య’ పేరుతో రష్యా చేస్తున్న యుద్ధంలో ఇప్పటివరకు 346 మంది చిన్నారులు బలయ్యారు.
కీవ్: ఉక్రెయిన్‌పై ‘సైనిక చర్య’ పేరుతో రష్యా చేస్తున్న యుద్ధంలో ఇప్పటివరకు 346 మంది చిన్నారులు బలయ్యారు. మరో 645 మంది గాయపడ్డారు. ఈ మేరకు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
అయితే, ఇవి పూర్తి గణాంకాలు కావని.. ఇంకా మరికొన్ని ప్రాంతాల నుంచి దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాల్సి ఉందని ప్రకటనలో తెలిపింది. జనావాసాలపై దాడి చేయబోమని ముందు నుంచి చెబుతూనే రష్యా దానికి విరుద్ధంగా దాడులు కొనసాగిస్తోంది. ఏ మాత్రం కనికరం లేకుండా విద్యా సంస్థలపైనా బాంబు దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 2,108 విద్యాసంస్థలు దెబ్బతిన్నాయి. వాటిలో 215 పూర్తిగా ధ్వంసమయ్యాయి.
యూనిసెఫ్ మే నెలలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఉక్రెయిన్‌లో సుమారు 3 మిలియన్ల పిల్లలు ఉన్నారు. శరణార్థులకు ఆతిథ్యమిచ్చే దేశాల్లో దాదాపు 2.2 మిలియన్లకు పైగా పిల్లలు మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఉక్రెయిన్‌లో పిల్లల రక్షణ సంక్షోభానికి రష్యా చేస్తున్న యుద్ధమే కారణమైందని యూనిసెఫ్ హెచ్చరించింది. దేశం వీడి పారిపోతున్న పిల్లలపై లైంగిక దాడి, అక్రమ రవాణా జరిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. మరోవైపు రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలోని ప్రతి ముగ్గురి పిల్లల్లో ఇద్దరు ఇతర దేశాలకు తరలివెళ్లినట్లు ఐరాస ఏజెన్సీ నివేదించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన
గాజా జనాభాలో 70 శాతం మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు ఐరాస(UN) ఆందోళన వ్యక్తం చేసింది. -
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్
అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమని చైనాకు విదేశాంగశాఖ మరోసారి స్పష్టం చేసింది. -
Flight Journey: ‘లావుగా ఉన్నామని విమానం నుంచి దించేశారు’
లావుగా ఉన్నారనే నెపంతో ఇద్దరు మహిళలను విమానం నుంచి దించేసిన దారుణ ఘటన ఎయిర్ న్యూజిలాండ్‌లో (New Zealand) చోటుచేసుకుంది. -
Israel: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్‌లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్‌లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.
తాజా వార్తలు (Latest News)
-
Janasena: పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైంది: పవన్ కల్యాణ్
-
Social Look: కృతి సనన్ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్, కియారా మెరుపులు
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన
-
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు
-
YSRCP: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
-
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా