International airport: ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీక్.. 39 మందికి అస్వస్థత

విమానాశ్రయంలో గ్యాస్‌ లీక్‌ అవ్వడంతో పలువురు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కౌలాలంపూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.    

Updated : 05 Jul 2024 12:04 IST

(ప్రతీకాత్మక చిత్రం)

కౌలాలంపూర్: విమానాశ్రయంలో గ్యాస్‌ లీక్‌ కావడంతో సుమారు 39 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురైన ఘటన మలేసియా(Malaysia)లోని కౌలాలంపూర్‌(Kuala Lumpur) అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. 

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎయిర్‌పోర్ట్‌లోని సదరన్ సపోర్ట్ జోన్ సెపాంగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ ఫెసిలిటీ వద్ద గురువారం ఉదయం 11.23 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) గ్యాస్ లీకైంది. సమాచారం అందుకున్న సెలంగోర్ అగ్నిమాపక విభాగం లీకేజీని నివారించింది. ఈ ఘటనలో దాదాపు 39 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. 14 మందిని చికిత్స కోసం ఎయిర్ డిజాస్టర్ యూనిట్‌కి పంపామని, ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. విడుదలైన గ్యాస్‌ను మిథైల్ మెర్‌కాప్టాన్‌గా గుర్తించామన్నారు. విమాన రాకపోకల సమయాల్లో ఎటువంటి మార్పులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని