Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. 42మంది మృత్యువాత
పాకిస్థాన్(Pakistan)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు లోయలో పడి మంటలు చెలరేగిన ఘటనలో 42మంది దుర్మరణం చెందారు.
బలూచిస్థాన్: పాకిస్థాన్(Pakistan)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) సంభవించింది. బలూచిస్థాన్ ప్రావిన్స్(Balochistan province)లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఓ వంతెనపై స్తంభాన్ని ఢీకొట్టి లోయలోకి దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో మహిళలు, చిన్నారులతో పాటు మొత్తం 42మంది మృత్యువాత పడినట్టు పోలీసులు వెల్లడించారు. మొత్తం 48మందితో క్వెట్టా నుంచి కరాచీకి వెళ్తున్న బస్సు లాబ్బెలా ప్రాంతంలో వంతెనపై ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి లోయలోకి దూసుకెళ్లగా మంటలు చెలరేగినట్టు తెలిపారు. ఘటనా స్థలంలో ఇప్పటివరకు 42 మృతదేహాలను వెలికి తీసినట్టు చెప్పారు. ఈ ఘటనలో ఒక మహిళ, చిన్నారి సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు. అలాగే, గాయపడిన మరికొందరిని ఆస్పత్రిలో చేర్పించగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదం తర్వాత బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని.. మృతుల్నిగుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు చేయనున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనావుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. పాకిస్థాన్‌లో రోడ్లు, హైవేల మరమ్మతులు అవసరమైన చోట చేయకపోవడం, వాణిజ్య వాహనాలకు లైసెన్సులు, పర్మిట్లు మంజూరు చేసేటప్పుడు సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Parliament: ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం
-
India News
Aadhaar-PAN: ఆధార్-పాన్ లింకు డెడ్లైన్ పొడిగించండి.. మోదీకి కాంగ్రెస్ లేఖ
-
Sports News
Venkatesh Prasad: కేఎల్ రాహుల్ పట్ల నేను కఠినంగా ప్రవర్తించలేదు : వెంకటేశ్ ప్రసాద్
-
World News
చైనా చొరబాటుపై అమెరికా ముందే చెప్పిందా..? శ్వేతసౌధం స్పందన ఇదే..!
-
Sports News
Virat Kohli: విరాట్ కోహ్లీ.. టీ20లు ఆడటం ఆపేయ్: షోయబ్ అక్తర్
-
India News
Death Penalty: ‘ఉరి’ విధానం క్రూరమైందా..? సుప్రీంకోర్టు ఏమంటోంది..!