Bird flu: 53 ఏళ్ల వ్యక్తిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు ..!
పక్షుల్లో కనిపించే బర్డ్ ఫ్లూ వ్యాధి ఇప్పుడు మానుషులకు సంక్రమిస్తోంది. చిలీలో 53 వ్యక్తిలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడటంతో తొలి కేసుగా నమోదు చేశారు.
చిలీ: సాధారణంగా పక్షులకు సంక్రమించే బర్డ్ ఫ్లూ (Bird flu) వ్యాధి ప్రస్తుతం మానవుల్లో కూడా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్, చైనాలో ఈ రకమైన కేసులు నమోదుకాగా.. తాజాగా చిలీ ( Chile)లో మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. 53 ఏళ్ల వ్యక్తిలో ఈ వ్యాధికి సంబంధించిన అనేక లక్షణాలు బయటపడ్డాయి. దేశంలో బుధవారం మొదటి కేసు నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health ministry) వెల్లడించింది. వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొంది. ఇది ఒక అంటువ్యాధి అని, కోళ్లు వంటి పక్షులు, సముద్ర జీవుల నుంచి ఈ వ్యాధి మానవులకు సంక్రమిస్తోందని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే మనిషి నుంచి మనిషి సంక్రమిస్తుందా ? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో వ్యాధి సోకిన వ్యక్తితో పరిచయం ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
వన్య జంతువుల్లో H5N1 బ్లడ్‌ఫ్లూ లక్షణాలు ఉన్నయానే విషయాన్ని చిలీ గతేడాది నివేదించింది. కేసుల సంఖ్య పెరుగుదలను నియంత్రించడానికి ప్రభుత్వం ఇటీవల కోళ్ల పరిశ్రమల నుంచి ఎగుమతులను సైతం నిలిపివేసింది. అర్జెంటీనాలోని పౌల్ట్రీలో కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎగుమతిదారు బ్రెజిల్‌లో మాత్రం ఈ వ్యాధి కేసులు నమోదు కాకపోవడం ఆశ్చర్యకరం. ఈ ఏడాది ప్రారంభంలో ఈక్వెడార్‌లోని 9ఏళ్ల బాలికలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. పరిశీలించిన అధికారులు ఇది ఇతర వ్యక్తుల నుంచి సంక్రమించిందని ధృవీకరించారు. అయితే మానవుల మధ్య సంక్రమణ వ్యాప్తి ప్రభావం తక్కువగా ఉందని గ్లోబల్ హెల్త్ అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్ తయారీదారులు మానవుల కోసం బర్డ్ ఫ్లూ టీకాలను తయారు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kannappa: ‘కన్నప్ప’లో ఆ స్టార్ హీరో.. విష్ణు ఏమన్నారంటే..?
-
Yashasvi Jaiswal: యశస్వీ స్టిల్ చూశారా... నెట్టింట మీమ్స్
-
Amit Shah: 3 నెలల్లో 4 విజయాలు.. మోదీ భాయ్తోనే సాధ్యం: అమిత్ షా
-
women's reservation: మహిళా రిజర్వేషన్‌పై ఆర్జేడీ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు
-
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన మంత్రి హరీశ్‌రావు
-
Ustaad bhagat singh: ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అప్డేట్ను షేర్ చేసిన హరీశ్ శంకర్..