China: చైనా సరిహద్దులకు ఆరు సైనిక డివిజన్లను తరలించిన భారత్‌..!

వాస్తవాధీన రేఖ వెంబటి చైనా సరిహద్దుల్లో వివాదం ఇప్పట్లో తగ్గేట్లు లేకపోవడంతో భారత్‌ కీలక చర్యలు తీసుకొంది. పాక్‌ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వైపు నుంచి ఆరు డివిజన్లను లద్ధాక్‌ సెక్టార్‌ నుంచి

Updated : 16 May 2022 14:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సరిహద్దుల్లో వివాదం ఇప్పట్లో తగ్గేట్లు లేకపోవడంతో భారత్‌ కీలక చర్యలు తీసుకొంది. పాక్‌ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వైపు నుంచి ఆరు డివిజన్లను లద్దాఖ్‌ సెక్టార్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు మోహరించింది. గతంలో భారత సైన్యం పాక్‌ వైపు నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేది. కానీ, ఇప్పుడు చైనా నుంచి వచ్చే ముప్పును అడ్డుకోవడానికి తొలి ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో దళాల మోహరింపుల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకొంటున్నాయి. ఆర్మీచీఫ్‌గా మనోజ్‌ పాండే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవల లద్దాఖ్‌లో పర్యటించి దళాల మోహరింపును సమీక్షించారు. చైనాతో సరిహద్దు వివాదం మొదలై దాదాపు రెండేళ్లు పూర్తైనా ఇంత వరకూ ఓ కొలిక్కి రాలేదు.

తాజా మార్పుల్లో భాగంగా జమ్ము-కశ్మీర్‌ ఉగ్రవాద కార్యకలాపాలను అణచి వేసే రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ డివిజన్‌ను తూర్పు లద్ధాఖ్‌ ప్రాంతానికి పంపించారు. ఇప్పటికే మూడు డివిజన్‌లు అక్కడ విధులు నిర్వహిస్తున్నాయి. హరియాణలోని స్ట్రైక్‌ కోర్‌ నుంచి ఒక డివిజన్‌ను ఉత్తరాఖండ్‌కు తరలించారు. వన్‌ స్ట్రైక్‌ కోర్‌కు చెందిన మరో రెండు డివిజన్లు కూడా లద్దాఖ్‌కు వెళ్లాయి. గతంలో ఇవి పాక్‌ సరిహద్దుల్లో విధులు నిర్వహించేవి. దీంతోపాటు 17 మౌంటెన్‌ స్ట్రైక్‌ కోర్‌కు ఝార్ఖండ్‌ నుంచి ఒక డివిజన్‌ను పంపించారు. అస్సాంలో మరో డివిజన్‌కు చైనా సరిహద్దుల బాధ్యతలు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని