Congo: కాంగో.. మిలీషియా దాడిలో 60 మంది మృతి!
వలసదారు శిబిరంపై మిలీషియా సభ్యుల దాడి
కిన్షాసా: డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మిలీషియా సభ్యులు భీకర దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా అక్కడ వలసదారుల శిబిరంపై దాడులకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జరిగిన దాడుల్లో దాదాపు 60 మంది మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఇటూరీ ప్రావిన్సుల్లో సావో శిబిరంలో జరిగిన ఈ మారణహోమానికి మిలీషియా సభ్యులే బాధ్యులని అక్కడి స్థానిక మానవ హక్కుల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
గతకొన్నేళ్లుగా ఇటూరీ ప్రావిన్సులో తలదాచుకున్న వందలాది మంది వలసదారులను మిలీషియా దళాలు చంపినట్లు ఐక్యరాజ్యసమితి నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇప్పటికే వేల మంది పౌరులు తమ నివాసాలను ఖాళీచేసి వెళ్లిపోయినట్లు తెలిపాయి. తాజాగా జరిగిన ఘటన కూడా శిబిరాల నుంచి వలసదారులను వెళ్లగొట్టే లక్ష్యంతోనే జరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే, ప్రస్తుతం సావో వలసదారుల శిబిరంలో 4వేల మంది తలదాచుకుంటున్నట్లు ఐరాస వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఈ దాడులు మరింత ఎక్కువైనట్లు పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
-
India News
Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
-
Sports News
Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
-
Movies News
RRR: ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన గూగుల్.. ఏం చేసిందంటే?
-
Politics News
BJP: ఈటల సమక్షంలో భాజపాలో చేరిన సినీనటుడు సంజయ్ రాయిచుర
-
General News
Gastritis: వానాకాలంలో వచ్చే ముప్పు ఏంటో తెలుసా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
- BJP: ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్
- MS Dhoni : దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో మెంటార్‌గా ధోనీ సేవలు ఈసారికి కష్టమే!
- Uddhav Thackeray: ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల దేశ భక్తులు కాలేరు’
- cardiac: ఛాతీలో నొప్పిగా ఉందా..? ఎందుకో తెలుసుకోండి..!
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- Yuan Wang 5: అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నౌకకు శ్రీలంక మరోమారు అనుమతి
- RRR: ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన గూగుల్.. ఏం చేసిందంటే?