Jerusalem: జెరూసలెంపై ఉగ్రదాడి.. వరుస పేలుళ్లు..!

జెరూసలెంలో వరుస పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. స్వల్ప వ్యవధిలో రెండు చోట్ల బాంబులు పేలగా 14 మందికి పైగా గాయపడ్డారు. 

Updated : 23 Nov 2022 12:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూదుల పవిత్ర స్థలమైన జెరూసలెంలో వరుస పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఇప్పటి వరకు రెండు చోట్ల పేలుళ్లు జరగ్గా.. 14 మందికిపైగా గాయపడినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌ పత్రిక పేర్కొంది. తొలి పేలుడు రద్దీగా ఉండే సెంట్రల్‌ బస్‌స్టేషన్‌లో బుధవారం ఉదయం చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఏడుగురికిపైగా గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. ఇజ్రాయెల్‌ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. బస్‌స్టాప్‌లో నిలిపి ఉంచిన ఓ ద్విచక్రవాహనంలో అమర్చిన బాంబు పేలినట్లు ఓ మీడియా కథనం  పేర్కొంది. ఇది ఉగ్రదాడి అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

తొలి పేలుడు జరిగిన కొద్ది సేపటికే రామోట్‌ జంక్షన్‌లోని ఓ బస్సు వద్ద మరో పేలుడు చోటు చేసుకొంది. దీనిలో ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వరుస పేలుళ్ల కారణంగా జెరూసలెంలోకి వెళ్లే రోడ్‌ వన్‌ను మూసివేశారు. టెల్‌ అవీవ్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను మళ్లించారు. ఇజ్రాయెల్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ మంత్రి ఇట్మార్‌ బెన్‌ మాట్లాడుతూ ఘటనా స్థలానికి బయల్దేరానని పేర్కొన్నారు. ఈ పేలుళ్లతో ఇంతిఫాదా (తిరుగుబాటు) సమయం మళ్లీ వచ్చినట్లు అనిపిస్తోందన్నారు. కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు