Haj Pilgrimage: సౌదీ మృతుల్లో 98 మంది భారతీయులు..!

హజ్‌ యాత్రకు భారత్‌ నుంచి ఇప్పటివరకు 1.75 లక్షల మంది వెళ్లినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది.

Published : 21 Jun 2024 21:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది హజ్‌ యాత్రలో ఇప్పటివరకు 98 మంది భారతీయులు మృతి చెందినట్లు విదేశాంగశాఖ (MEA) వెల్లడించింది. జులై 22 వరకు సాగనున్న ఈ యాత్రకు మన దేశం నుంచి ఇప్పటివరకు 1.75 లక్షల మంది వెళ్లినట్లు తెలిపింది. సహజ కారణాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు, వృద్ధాప్యం కారణంగా మరణాలు సంభవించాయని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు. గత ఏడాది మృతుల సంఖ్య 187గా నమోదైందని పేర్కొన్నారు. అక్కడికెళ్లిన భారతీయుల కోసం ప్రభుత్వం తరఫున చేయగలిగినదంతా చేస్తున్నామని మీడియా సమావేశంలో చెప్పారు.

నా ఆరోగ్య రహస్యం అదే.. బిల్‌గేట్స్‌ చెప్పిన ఆరోగ్య చిట్కాలు

సౌదీ అరేబియాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం క్రితం అత్యధికంగా 51.8 డిగ్రీలు నమోదైంది. దీంతో హజ్‌ యాత్రకు వెళ్లిన వారిలో వందలాది మంది వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య 1000 దాటినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. వీరిలో అత్యధికులు ఈజిప్టు దేశస్థులే. ఆయా దేశాల రాయబార కార్యాలయాల ప్రకటనల ఆధారంగా ఈ సంఖ్యను లెక్కించినట్లు సమాచారం. మెడికల్‌ కాంప్లెక్సు వద్ద కొంతమంది మృతుల వివరాలు ప్రకటించారు. ఈ జాబితాలో అల్జీరియా, ఈజిప్టుతోపాటు భారత్‌కు చెందినవారి పేర్లు కూడా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని