Ukrainian woman: నేనూ యుద్ధం చేస్తా.. వయస్సుతో పనేముంది..!

రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ను రక్షించుకుంటున్నదని అక్కడి ప్రజలే. దేశ సైన్యంతో పాటు ప్రాణాలకు వెరవకుండా గట్టి పోరాటం చేస్తున్నారు.

Published : 20 Mar 2022 01:36 IST

రష్యాపై పోరుకు ముందుకొచ్చిన 98 ఏళ్ల బామ్మ

కీవ్‌: రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ను రక్షించుకుంటున్నారు అక్కడి ప్రజలు. దేశ సైన్యంతో పాటు ప్రాణాలకు వెరవకుండా గట్టి పోరాటం చేస్తున్నారు. తమ మాతృభూమి శత్రుదేశానికి చిక్కొద్దని విదేశాల్లో ఉండే ఉక్రెయిన్‌ వాసులు స్వదేశానికి రాగా.. వయసుతో సంబంధం లేకుండా యుద్ధభూమిలో దిగుతామంటున్నారు మరికొందరు. తాజాగా 98 ఏళ్ల బామ్మ తన దేశాన్ని కాపాడుకునేందుకు తుపాకీ పట్టుకుంటానని అధికారుల్ని సంప్రదించారు. ఆమెకు అన్ని అర్హతలున్నా.. వయస్సు కారణంగా ఆగిపోవాల్సి వచ్చింది. ఈ మేరకు ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ వివరాలు వెల్లడించింది. 

‘98 ఏళ్ల ఒల్హా వెర్డోఖ్లిబొవా.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సేవలు అందించారు. ఇప్పుడు తన జీవితంలో రెండోసారి యుద్ధాన్ని చూస్తున్నారు. ఈ వయస్సులో కూడా ఆమె తన మాతృభూమిని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమెకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ.. వయస్సు కారణంగా ఆమెను తిరస్కరించాల్సి వచ్చింది. అయితే ఆమె కీవ్‌లో మరో విజయాన్ని జరుపుకొంటారని మేం ఖచ్చితంగా అనుకుంటున్నాం’ అంటూ ట్వీట్ చేసింది. 

ఫిబ్రవరి 24న రష్యా దాడి ప్రారంభించగా.. తన అంచనాలకు తగ్గట్టుగా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోలేకపోతోంది. అందుకు స్థానిక ప్రజలే కారణం. వారు సైనికుల మాదిరిగా తుపాకులు పట్టుకొని, రష్యన్ సేనల్ని ఎదురిస్తున్నారు. వారిలో ఉత్సాహం తగ్గకుండా ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ స్ఫూర్తి మాటలు చెప్తున్నారు. ఇన్ని రోజులైనా ఈ వైఖరే ఉక్రెయిన్‌ను శత్రువుపరం కాకుండా కాపాడుతోంది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు