Iran: కరోనా ఆ పాఠశాల విద్యార్థుల్ని బతికించింది..!

కరోనా కారణంగా పాఠశాల మూసివేయడంతో ఇరాన్‌లో పెను ప్రమాదం తప్పిపోయింది. 

Published : 22 Feb 2022 01:29 IST

 ఇరాన్‌లో బడిలోకి దూసుకెళ్లి, కూలిన యుద్ధవిమానం

టెహ్రాన్‌: కరోనా కారణంగా పాఠశాల మూసివేయడంతో ఇరాన్‌లో పెను ప్రమాదం తప్పిపోయింది. శిక్షణలో ఉన్న ఎఫ్‌-5 యుద్ధ విమానం సోమవారం వాయువ్య ప్రాంతమైన తబ్రిజ్‌లో కూలిపోయింది. ఆ ప్రాంతంలోని పాఠశాల ఆవరణలోకి దూసుకెళ్లి, అక్కడి గోడను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది, ఒక పౌరుడు మరణించారు. 

‘కరోనా మహమ్మారి కారణంగా అదృష్టవశాత్తూ పాఠశాల మూసివేసి ఉంది’ అని స్థానిక అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. కాగా, అది శిక్షణ విమానం అని అధికారులు తెలిపారు. అందులోని ఇద్దరు సిబ్బంది అక్కడికక్కడే మరణించగా.. మరో మృతుడు ఆ దగ్గర్లో నివసించే వ్యక్తని చెప్పారు. ఈ ఘటనలో పాఠశాల గోడలు నల్లగా మసిబారిపోయాయి. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని