మోదీ రాకకోసం ఆసక్తిగా ప్రవాసులు.. NMODI నంబర్ ప్లేట్‌ను ప్రదర్శించిన అభిమాని
ప్రధాని మోదీ(Modi) అమెరికా పర్యటనపై ప్రవాస భారతీయులు అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆయన రాకకోసం ఎదురుచూస్తూ.. స్వాగత సందేశాలు పెడుతున్నారు.
మేరీలాండ్: మరికొన్ని రోజుల్లో అమెరికాలో పర్యటించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి (Narendra Modi) ఘన స్వాగతం పలికేందుకు అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం వారు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఓ ప్రవాస భారతీయుడు ప్రధానిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మేరీలాండ్‌కు చెందిన రాఘవేంద్ర అనే వ్యక్తి కారు నంబర్ ప్లేట్‌పై ‘NMODI’ అని రాయించారు.
‘నేను 2016లోనే ఈ ప్లేట్‌ను సిద్ధం చేసుకున్నాను. ప్రధాని మోదీ నాకొక స్ఫూర్తి. సమాజం, దేశం, ప్రపంచం కోసం ఏదైనా మంచి చేయాలనే ప్రేరణను ఆయన నుంచి పొందాను. ఇప్పుడు ప్రధాని ఇక్కడికి వస్తున్నారు. ఆయన్ను ఆహ్వానించేందుకు ఎదురుచూస్తున్నాను’అని రాఘవేంద్ర అన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), ఆయన సతీమణి జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు మోదీ జూన్ 21 నుంచి 24 వరకు అక్కడ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అమెరికా కాంగ్రెస్‌లో రెండోసారి ప్రసంగిస్తారు. ఈ క్రమంలో శుక్రవారం శ్వేతసౌధం వెలుపల త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. దీనిపై న్యూజెర్సీకి చెందిన ప్రవాస భారతీయుడు జెసల్ నార్ మాట్లాడుతూ.. ‘శ్వేతసౌధం వద్ద జాతీయ పతాకం రెపరెపలాడటం గర్వంగా, గౌరవంగా ఉంది’అని అన్నారు.
టైమ్స్ స్క్వేర్, నయాగరా ఫాల్స్ వంటి ప్రసిద్ధ ప్రాంతాల నుంచి ప్రవాస భారతీయులు స్వాగత సందేశాలు పంపుతున్నారు. ఉన్నత విద్య కోసం వెళ్లిన యువత.. ప్రధానిని ఆహ్వానిస్తూ సామాజిక మాధ్యమాల్లో స్వాగత సందేశాలు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ పర్యటన నేపథ్యంలో భారత్-అమెరికా సంబంధాలు(India-US Relationship) మరో స్థాయి చేరుకుంటాయని అమెరికాలోని భారత దౌత్యవేత్త తరణ్ జిత్‌సింగ్ సందు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: రాజమహేంద్రవరం చేరుకున్న కార్ల ర్యాలీ
-
Kishan Reddy: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర: కిషన్‌రెడ్డి
-
iPhone 15: ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
-
China: చైనాలో జనాభా సంఖ్య కంటే ఖాళీ ఇళ్లే ఎక్కువ..!
-
Visakhapatnam: విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్లో ఏడు రైళ్ల నిలిపివేత
-
Pinarayi Vijayan: ‘అందుకే.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు’