బతికుండగానే కన్నకూతురిని సమాధి చేసిన తండ్రి

అనారోగ్యంతో ఉన్న కన్నకూతురును కాపాడుకునే స్థోమత లేదని, ఓ తండ్రి తన బిడ్డను సజీవంగా పాతిపెట్టాడు.  

Updated : 08 Jul 2024 10:45 IST

ఇంటర్నెట్‌డెస్క్: తల్లి గర్భం నుంచి భూమ్మీదకొచ్చి 15 రోజులు కూడా పూర్తికాని ఓ పసికందును కన్నతండ్రే సజీవంగా పాతిపెట్టాడు. అందుకు అతడు చెప్పిన కారణం విని పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా నిందితుడు వెల్లడించిన వివరాల ప్రకారం..

పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రాంతానికి చెందిన తయ్యబ్‌ భార్య 15 రోజుల క్రితం ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత నుంచి ఆ పసికందు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. చికిత్స చేయించేందుకు డబ్బు లేకపోవడంతో, బతికుండగానే బిడ్డను గొయ్యితీసి పాతిపెట్టినట్లు తయ్యబ్ అంగీకరించాడు. ఆ శిశువును ఒక గోనె సంచిలో తీసుకెళ్లి, థారుశాహ్‌ ప్రాంతంలో సమాధి చేసినట్లు వెల్లడించాడు. అతడు నేరం అంగీకరించడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఫొరెన్సిక్ పరీక్ష నిమిత్తం కోర్టు ఆదేశాల ప్రకారం ఆ సమాధిని తవ్వనున్నారని స్థానిక మీడియా తెలిపింది. గతంలోను పాక్‌లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ముఖాకృతి సరిగా లేదని పుట్టిన రెండు రోజులకే ఓ తండ్రి తన బిడ్డను సజీవంగా పాతిపెట్టి, కటకటాల పాలయ్యాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని