Oscar Awards: జెలెన్‌స్కీకి ఆస్కార్ షాక్..!
ఆస్కార్ నిర్వాహకుల నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelenskyy)కి మరోసారి చుక్కెదురైంది. వేదికపై ఆయన ప్రసంగానికి నో చెప్పారు.
లాస్‌ఏంజెల్స్: ఉక్రెయిన్(Ukraine)పై రష్యా దురాక్రమణ ప్రారంభించిన దగ్గరి నుంచి ఆ దాడి గురించి అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తున్నారు వొలొదిమిర్ జెలెన్‌స్కీ( Volodymyr Zelenskyy). అయితే ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేదికపై తమ దేశం ఎదుర్కొంటోన్న క్లిష్టపరిస్థితులను ఇంకా ఎక్కువ మంది దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఆయన కల మాత్రం నెరవేరేలా కనిపించడం లేదు. ఈ విషయంలో ఆస్కార్ నిర్వాహకుల నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడికి షాక్ తగిలింది. ఆ వేదికపై మాట్లాడేందుకు ఆయనకు అనుమతి లభించలేదని అమెరికన్ మీడియా సంస్థ వెల్లడించింది. ఆయనకు ఈ అనుభవం ఎదురుకావడం ఇది వరుసగా రెండోసారి.
ఈసారి వేడుకల్లో జెలెన్‌స్కీ(Zelenskyy) ప్రసంగించేందుకు అనుమతి ఇవ్వాలని అకాడమీ బృందానికి అభ్యర్థన రాగా.. అది కాస్తా తిరస్కరణకు గురైంది. అయితే ఆ తిరస్కరణపై మీడియా ప్రశ్నించగా.. అకాడమీ బృందం స్పందించలేదు. అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు అందుతోన్న మద్దతు తగ్గిపోతున్నట్లు కనిపిస్తోన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 2022 ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగిస్తోంది. దీని గురించి ఎన్నో వేదికలపై స్పందించిన ఆయన.. గతేడాది 64వ గ్రామీ అవార్డుల వేదికపైనా వర్చువల్‌గా మాట్లాడారు.
ఇప్పటికే 95వ ఆస్కార్ అవార్డుల( 95th annual Academy Awards) సందడి మొదలైంది. మార్చి 12న లాస్‌ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుక జరగనుంది. మార్చి 13 ఉదయం ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఊరేగింపులో పడిపోయిన వినాయకుడి విగ్రహం.. సాయం చేసిన ముస్లిం యువత.. వీడియో!
-
JK: ₹300 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. ఇద్దరి అరెస్టు
-
Narnia: గుజరాత్ సముద్ర తీరానా హుందాగా మృగరాజు.. అరుదైన ఫొటో వైరల్..!
-
Chahal: బాధ ఎందుకు ఉండదు.. కానీ 15 మందికే కదా అవకాశం: చాహల్
-
PM Modi: తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ: ప్రధాని మోదీ
-
Jaguar Land Rover: 2030 కల్లా 8 విద్యుత్ వాహనాలను తీసుకొస్తాం: జాగ్వార్ ల్యాండ్‌రోవర్