gold mine: బంగారు గనిలో ప్రమాదం.. 11 మంది మృతి

ఇండోనేషియాలోని ఓ బంగారు గనిలో కొండ చరియలు విరిగిపడడంతో 11మంది కార్మికులు మృతి చెందారు.

Published : 08 Jul 2024 12:03 IST

జకార్తా: ఇండోనేషియా, సులవేసి ద్వీపంలోని ఓ బంగారు గనిలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గనిలో కొండ చరియలు విరిగిపడడంతో 11మంది కార్మికులు మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించారు. 

అంతర్జాతీయ వార్తా సంస్థల కథనం ప్రకారం గోరంటాలో ప్రావిన్స్‌లోని రిమోట్ బోన్ బొలాంగో ప్రాంతంలో కొందరు బంగారు గనిని అక్రమంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం సుమారు 33 మంది గ్రామస్థులు బంగారు గనిలో పనులు చేస్తుండగా భారీ వర్షాల కారణంగా కొండ చరియలు ఒక్కసారిగా విరిగి వారిపై పడినట్లు గోరంటా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి అఫీఫుద్దీన్ ఇలాహుడే తెలిపారు. 

కాగా రక్షణ బృందాలు సహాయక చర్యల్లో భాగంగా ఆదివారం ఒకరిని రక్షించారు. మిగిలినవారంతా గనిలో చిక్కుకుపోయారు. సోమవారం 11 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు పేర్కొన్నారు. గల్లంతైన మరో 20 మంది కోసం గాలిస్తున్నామన్నారు. అయితే ఇండోనేషియాలో ఇటువంటి అనధికార మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహించడం సర్వసాధారణంగా మారిందని అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని