Afghanistan: టీవీ యాంకర్లూ ముఖాలు కప్పుకోవాల్సిందే : తాలిబన్ల హుకుం

ప్రసార సమయాల్లో మహిళా టీవీ యాంకర్లు తమ ముఖాలు కనిపించకుండా కప్పుకోవాలని తాలిబన్లు ఆదేశాలు జారీచేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Published : 20 May 2022 01:54 IST

అఫ్గానిస్థాన్‌లో పెరుగుతున్న తాలిబన్ల ఆంక్షలు

కాబుల్‌: అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడి ప్రజలపై తాలిబన్లు ఆంక్షలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలికల విద్య, మహిళలు స్వేచ్ఛగా బయటకు రావడంపై తాలిబన్ల ఆంక్షలు ఎక్కువయ్యాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మహిళా టీవీ యాంకర్లపైనా తాలిబన్లు ఆంక్షలకు ఉపక్రమించారు. వార్తల ప్రసారం సమయాల్లో మహిళా టీవీ యాంకర్లు తమ ముఖాలు కనిపించకుండా కప్పుకోవాలని హుకుం జారీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

అయితే, తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలకు ఎదురుచెప్పే పరిస్థితి కానీ, వాటిపై బహిరంగంగా చర్చించే పరిస్థితి గానీ లేదని అఫ్గాన్‌కు చెందిన టోలో న్యూస్‌ అభిప్రాయపడింది. ఇటువంటి ఆదేశాలే దేశంలోని అన్ని టీవీ, రేడియో నెట్‌వర్క్‌ సంస్థలకు వెళ్లినట్లు తెలిపింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మహిళా యాంకర్లు ముఖాలకు మాస్కులు ధరించి ప్రసారాలను కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కొందరు యాంకర్లు సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని