Gallup: ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశం ఏంటో తెలుసా..?

ప్రపంచంలోనే అత్యంత సురక్షిత, అసురక్షిత దేశాల జాబితాను అంతర్జాతీయ సంస్థ గాలప్‌ విడుదల చేసింది. 

Published : 28 Oct 2022 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశం ఎంటో తెలుసా..? ఏ దేశంలో శాంతి భద్రతలు అధ్వానంగా ఉన్నాయో తెలుసా..? ఈ వివరాలతో ఈ ఏడాదికి గ్లోబల్‌ అనలిటిక్స్‌ సంస్థ ‘గాలప్‌’..లా అండ్ ఆర్డర్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. 

ఈ జాబితాలో సింగపూర్‌ అత్యుత్తమ స్కోర్ సాధించింది. 96 పాయింట్లతో ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా నిలిచింది. తజికిస్థాన్‌, నార్వే, స్విట్జర్లాండ్‌, ఇండోనేషియా మొదటి ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. 120 దేశాల్లో నిర్వహించిన సర్వేలో భారత్‌ 80 పాయింట్లు సాధించి 60 ర్యాంకుంలో నిలిచింది. పాయింట్ల పరంగా శ్రీలంక, పాకిస్థాన్‌తో పోల్చుకుంటే స్వల్పతేడానే కనిపించింది. అయితే భారత్‌ కంటే యూకే దిగువన ఉండటం గమనార్హం. గత ఏడాది అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడంతో అఫ్గానిస్థాన్‌లో పౌర ప్రభుత్వం కూలిపోయింది. తాలిబన్లు గద్దెనెక్కారు. వారి పాలనలో ఆ దేశం అత్యంత అసురక్షిత దేశంగా నిలిచింది. 51 పాయింట్లు సాధించి జాబితాలో చిట్టచివరి స్థానానికి పడిపోయింది. అఫ్గాన్ తర్వాత కింది నుంచి ఐదు స్థానాల్లో గాబన్‌, వెనిజువెలా, డెమొక్రాటిక్ రిపబ్లిక్‌ ఆఫ్ కాంగో, సియెర్రా లియోన్‌ నిలిచాయి. ప్రజలు ఎంత సురక్షితంగా ఉన్నామని భావిస్తున్నారు..? గత ఏడాది దాడులు, దోపిడీల తీవ్రత ఎంత..? అనే ప్రాతిపదికన ఈ నివేదికను రూపొందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని