Canada: కెనడా ఉగ్ర జాబితాలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌..!

ఇరాన్‌లో శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ దళాన్ని కెనడా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. దీనిపై ఇరాన్‌ స్పందించింది.

Published : 20 Jun 2024 15:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌లో రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ దళం (Irans Revolutionary Guards) అత్యంత శక్తిమంతమైంది. ఆ దేశ రక్షణ, వ్యూహాత్మక కార్యకలాపాల్లో దీని పాత్ర కీలకం. అయితే.. ఈ దళం పనితీరుపై కెనడా (Canada) ప్రభుత్వం గుర్రుగా ఉంది. తమ దేశ తీవ్రవాద సంస్థల జాబితాలో ఐఆర్‌జీసీని చేర్చింది. దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. కెనడా చర్యను ఖండిస్తూ.. ఇరాన్‌ దళం విషయంలో అవివేకంతో ప్రవర్తిస్తోందని మండిపడింది.

కెనడా తీసుకున్న ఈ నిర్ణయం ఐఆర్‌జీసీ చట్టనిబద్ధత, శక్తిపై ఎలాంటి ప్రభావం చూపదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నాజర్‌ కనానీ పేర్కొన్నారు. తెలివితక్కువ, రాజకీయ ప్రేరేపితమైన కుట్రపూరిత చర్యగా అభివర్ణించారు. ట్రూడో సర్కారు చర్యపై స్పందించేందుకు టెహ్రాన్‌కు హక్కు ఉందని పునరుద్ఘాటించారు.

గల్వాన్‌ తరహా ఘటన.. ఫిలిప్పీన్స్‌ నేవీపై చైనా దళాలు కత్తులు, గొడ్డళ్లతో దాడి..!

ఇరాన్‌ ఐఆర్‌జీసీలోని ఖుద్స్‌ ఫోర్స్‌ అనే విభాగం విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రివల్యూషనరీ గార్డ్స్‌ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని గతంలో పాశ్చాత్య దేశాలు ఆరోపించాయి. దీంతో 2019లోనే అమెరికా ఐఆర్‌జీసీని ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే. తాజాగా కెనడా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొంది. తమ దళంపై వస్తున్న ఆరోపణలను టెహ్రాన్‌ కొట్టి పారేస్తోంది. ఎలైట్‌ ఫోర్స్‌ జాతీయ భద్రతను కాపాడే బాధ్యత తమపై ఉందని.. దాన్ని సార్వభౌమ సంస్థగా పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని