Bryan Johnson: ఆ వ్యాపారవేత్త వయస్సు 45.. 18 ఏళ్ల యువకుడిగా మారాలని..!

45 ఏళ్ల వ్యాపారవేత్త బ్రియాన్‌ జాన్సన్‌ (Bryan Johnson) 18 ఏళ్ల యువకుడిగా మారాలన్న ఉద్దేశంతో ప్రత్యేక వైద్య చికిత్స చేయించుకుంటున్నారు. దీని కోసం ఏడాదికి 2 మిలియన్‌ డాలర్లు ఖర్చు పెడుతున్నారు.

Published : 27 Jan 2023 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వయసు పెరిగే కొద్దీ శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయి. వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ఇదంతా సృష్టి ధర్మం.  అయితే దీనికి విరుద్ధంగా వయసు మీద పడుతున్నా యువకుడిలా కనిపించాలనుకున్నారు ఓ వ్యక్తి. అతనే బ్రియాన్‌ జాన్సన్‌ (Bryan Johnson). వయసును తగ్గించుకునే ప్రయత్నంలో ఏం చేస్తున్నాడో తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియో రూపొందించి యూట్యూబ్‌లో విడుదల చేశారు.

వృద్ధాప్యఛాయలు కనిపించకుండా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో కాలిఫోర్నియాకు చెందిన బ్రియాన్‌ జాన్సన్‌ అనే వ్యాపారవేత్త వైవిధ్యంగా ఆలోచించాడు. 45 ఏళ్ల వయస్సులోనూ 18 ఏళ్ల యువకుడిలా కనిపించాలనే ఉద్దేశంతో ప్రత్యేక వైద్య చికిత్సను పొందుతున్నారు. దీని కోసం ఏడాదికి 2 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నారు.

బ్లూమ్‌బర్గ్‌ కథనం ప్రకారం.. శరీరంలో కొన్ని మార్పులు చేసినట్లయితే వయస్సు ప్రభావం కనిపించకుండా దీర్ఘాయువు పొందవచ్చని బ్రియాన్‌ జాన్సన్‌ (Bryan Johnson) ఎక్కడో చదివాడు. దీంతో 18 ఏళ్ల వయస్సులో తాను ఎలా కనిపించేవాడో తిరిగి ఆ రూపం తెప్పించుకోవాలన్న కోరికతో అతడు వైద్యులను సంప్రదించారు. ఆలివర్‌ జోల్మాన్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం జాన్సన్‌కు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా నిత్యం యువకుడిలా కనిపించేలా చికిత్స చేస్తామని హామీ ఇచ్చింది. చికిత్స తర్వాత శరీర దారుఢ్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం 18 ఏళ్ల యువకుడిలా, గుండె పని తీరు 37 ఏళ్ల వ్యక్తిలా, చర్మం నిగారింపు 28 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తున్నట్లు జాన్సన్‌ మీడియాకు వెల్లడించారు. 

జాన్సన్‌ శరీరభాగాల పని తీరును తెలుసుకునేందుకు నిత్యం 30 మంది వైద్యుల అతడిని పర్యవేక్షిస్తుందట. దీని కోసం కాలిఫోర్నియాలోని జాన్సన్‌ ఇంట్లో భారీ ఖర్చుతో ప్రత్యేక పరికరాలతో కూడిన ల్యాబ్‌ను కూడా సిద్ధం చేసినట్లు బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. ఈఏడాది కూడా 2 మిలియన్‌ డాలర్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధంగా ఉన్న జాన్సన్‌.. తన మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, దంతాలు ఇలా ప్రతీ అవయవం 18 ఏళ్ల యువకుడిలా మారేంత వరకు చికిత్స కొనసాగిస్తానని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు