Alien signal: అంగారకుడి నుంచి సందేశం.. గ్రహాంతరవాసులు పంపినదేనా?
అంగారక గ్రహం (Mars) నుంచి ఎన్‌కోడ్ చేసి వచ్చిన సమాచారాన్ని యూరప్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్ ట్రేజ్ గ్యాస్ ఆర్బిటార్ (TGO) భూమికి (Earth) చేరవేసింది. ఇలా ఇతరగ్రహాల నుంచి ఎన్‌కోడెడ్ సమాచారం రావడం ఇదే తొలిసారి.
ఇంటర్నెట్‌డెస్క్: కేవలం భూమి (Earth) మీదనే జీవజాలం ఉందా? ఈ సువిశాల అంతరిక్షంలో ఇలాంటి గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా? అక్కడ జీవం ఉందా.... గ్రహాంతరవాసులు (Aliens) జీవిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం చాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. గ్రహాంతరవాసులపై కచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ.. ఏదో ఒక గ్రహంపై జీవిస్తున్నారనేదే అందరి నమ్మకం. వాటికి మరింత ఊతమిచ్చే ఘటన తాజాగా చోటు చేసుకుంది. భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్ చేసిన ఓ సమాచారాన్ని యూరప్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్ (TGO) భూమికి చేరవేసింది. అంగారకుడి చుట్టూ తిరుగుతూ అక్కడి పరిస్థితులను నిశితంగా గమనించేందుకు యూరప్ స్పేస్ ఏజెన్సీ టీజీవోను గతంలో ప్రయోగించింది. అయితే, ఈ సందేశాన్ని గ్రహాంతర వాసులే పంపించారా? అనే దానిపై స్పష్టత లేదు.
అంగారక గ్రహం నుంచి సమాచారాన్ని స్వీకరించిన టీజీవో 16 నిమిషాల్లో ఆ సందేశాన్ని ఎర్త్ స్టేషన్‌కు అందించింది. అందులో ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక వేళ అది గ్రహాంతర వాసులే పంపిన సమాచారమైతే.. ఈ ఘటన చరిత్రలో నిలిచిపోతుందని ‘ఎ సైన్స్ ఇన్ స్పేస్’ ప్రాజెక్టులో భాగమైన డానియేలా ది పౌలిస్ అన్నారు. ‘‘ఇది చరిత్రలోనే నిలిచిపోయే ఘటన. గ్రహాంతరవాసుల ఉనికి కోసం ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇతర గ్రహాలపైనున్న జీవరాశుల నుంచి ఓ సందేశం రావడం భవిష్యత్ పరిశోధనలకు పునాదిగా నిలుస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు ఊతమిస్తోంది’’ అని పౌలిస్ పేర్కొన్నారు.
అయితే, ఎన్‌కోడ్ చేసిన ఆ సందేశంలో ఏముందో తెలుసుకోవడం శాస్త్రవేత్తలకు కఠిన సమస్యగా మారింది. దానిని డీకోడ్ చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవారికి అవకాశం కల్పించారు. శాస్త్రసాంకేతిక పరంగానే కాకుండా ఆ సందేశంలో సాంస్కృతిక పరమైన అంశాలేమైనా ఉన్నాయా?అనే కోణంలోనూ పరిశీలించేందుకు సమాయత్తమవుతున్నారు. అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్ చేసి వచ్చిన సిగ్నల్స్‌ను https://asignin.space/the-message/ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆసక్తి ఉన్న వారు వాటిని డీ కోడ్ చేసి, దాని అర్థాన్ని తిరిగి వారికి పంపించవచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/05/2023)
-
Politics News
Mamata Benarjee: బెంగాల్లోనూ అల్లర్లు సృష్టించాలని భాజపా యత్నిస్తోంది: మమత
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆసీస్ తుది జట్టులో అతనుంటే బెటర్: రికీ పాంటింగ్
-
Movies News
ఆ సినిమా చూసి నా భార్య నన్ను తిట్టింది: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ నటుడు
-
India News
Sengol: రాజదండాన్ని చేతికర్ర చేశారు కదా.. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన మోదీ
-
General News
CM KCR: బ్రాహ్మణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్య సమాజంపై ఉంది: కేసీఆర్