Ukraine Crisis: చమురు దిగుమతులపై నిషేధం.. బైడెన్‌ కీలక ప్రకటన

ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తోన్న రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. రష్యా నుంచి గ్యాస్‌, ముడి చమురు దిగుమతులపై నిషేధం విధించింది...

Published : 09 Mar 2022 01:26 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తోన్న రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. రష్యా నుంచి గ్యాస్‌, ముడి చమురు దిగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికారికంగా ప్రకటించారు. ఈయూ మిత్ర దేశాలు ఈ విషయంలో తమతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేవని,  మిత్ర దేశాల పరిస్థితులను తాము అర్ధం చేసుకోగలమని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటూ నిధులు అందిస్తామని బైడెన్‌ స్పష్టం చేశారు. ఆర్థిక, భద్రత, మానవతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బైడెన్‌ తెలిపారు. చమురు దిగుమతులపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వెల్లడించారు.

రష్యా నుంచి గ్యాస్‌, ముడిచమురు తీసుకోవద్దని అమెరికా, ఐరోపా దేశాలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థించిన విషయం తెలిసిందే. చమురు ఎగుమతుల ద్వారా రష్యాకు పెద్ద ఎత్తున నగదు అందుతున్నందున పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావం రష్యాపై ఎక్కువగా లేదని బైడెన్‌ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా తన ఇంధన వినియోగంలో 8 శాతానికిపైగా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని