Published : 27 Jun 2022 21:29 IST

Modi-Biden: హలో మోదీ జీ.. దగ్గరకు వచ్చి మరీ పలకరించిన జో బైడెన్‌

జీ-7 సదస్సులో అగ్రదేశాధినేతలతో ప్రధాని బిజీబిజీ

బెర్లిన్‌: జర్మనీలో జరుగుతోన్న జీ-7 సదస్సులో (G7 Summit) భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీతోపాటు ఇతర దేశాల అధినేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇదే సమయంలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జీ-7 సదస్సు ప్రారంభానికి కొద్దిసేపటి ముందు మోదీ దగ్గరకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) పలుకరించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

జీ-7 సదస్సు సమయంలో కూటమిలో సభ్యదేశాల అధినేతలందరూ మాట్లాడుకుంటూ ఫొటోలు దిగుతున్నారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడోతో ప్రధాని మోదీ చేయిపట్టుకొని మెట్ల నుంచి కిందకు దిగుతున్నారు. అదే సమయంలో వెనుకవైపు నుంచి దగ్గరకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. మోదీ భుజం తట్టి పలుకరించారు. వెంటనే వెనక్కి తిరిగిన మోదీ.. బైడెన్‌తో కరచాలనం చేస్తూ ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇలా అగ్రనేతలు పలుకరించుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే.. ప్రపంచంలో సంపన్నదేశాలైన అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌లు జీ-7 కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఆహార భద్రత, ఉగ్రవాదంపై పోరాటంతోపాటు పలు అంతర్జాతీయ సవాళ్లపై చర్చించేందుకు జీ7 దేశాలు జర్మనీలో సమావేశమయ్యాయి. అయితే, ఈ కూటమిలో సభ్యదేశాలు కానప్పటికీ భారత్‌తోపాటు అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్‌, దక్షిణాఫ్రికా నేతలను జర్మనీ ఛాన్సలర్‌ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ క్రమంలో జీ7 దేశాలతోపాటు ఆహ్వానిత దేశాల నేతలతోనూ ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతూ బిజీబిజీగా గడిపారు.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని