Sanatana Dharma: ‘సనాతన ధర్మం’పై భారత్‌లో దుమారం.. అమెరికాలో దినోత్సవం
దేశ వ్యాప్తంగా ‘సనాతన ధర్మం’పై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో అమెరికాలో దాని కోసం ప్రత్యేకమైన రోజును కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అమెరికాలో ‘సనాతన ధర్మ’ దినోత్సవం
ఇంటర్నెట్‌డెస్క్: ‘సనాతన ధర్మం’పై (Sanatana Dharma) తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, డీఎంకేకి చెందిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. పలువురు కేంద్ర మంత్రులు, భాజపా నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని లూయిస్‌విల్లే పట్టణంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 3వ తేదీన ‘సనాతన ధర్మ దినోత్సవం’ నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం ప్రకటించడం చర్చనీయాంశమైంది. కెంటకీ రాష్ట్రంలోని ఈ పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు మేయర్ క్రెయిగ్ గ్రీన్‌బెర్గ్ ప్రకటించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు రవి శంకర్, చిదానంద సరస్వతి, పరమార్థ నికేత్ అధ్యక్షుడు రిషికేశ్, భగవతి సరస్వతి తదితరుల సమక్షంలో ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ సెప్టెంబరు 2న వ్యాఖ్యలు చేయగా.. ఆ తర్వాతి రోజునే ‘సనాతన ధర్మ దినోత్సవం’గా ఎంపిక చేయడం గమనార్హం.
‘తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దానిని వ్యతిరేకించడమే కాకుండా.. పూర్తిగా నిర్మూలించాలని ఆయన వ్యాఖ్యానించారు. అది తిరోగమన సంస్కృతి అని.. ప్రజలను కులాల పేరిట విభజించిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని రగుల్చుతున్నాయి. విపక్షాలు ఏర్పాటు చేసిన ‘ఇండియా’ కూటమి హిందూ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని అధికార భాజపా నాయకులు మండిపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: ఆసియా క్రీడలు.. షూటింగ్లో పతకాల పంట
-
Leo: ‘లియో’ ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్.. అసలు కారణమిదే..
-
S Jaishankar: ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు..: కెనడా వివాదంపై జైశంకర్ ఘాటు రిప్లై
-
NIA: ఖలిస్థానీ గ్యాంగ్స్టర్లపై విరుచుకుపడ్డ ఎన్ఐఏ.. ఆరు రాష్ట్రాల్లో తనిఖీలు..!
-
TS TET Results: టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
NEPAL vs MON: టీ20ల్లో చరిత్ర సృష్టించిన నేపాల్.. ఆసియా క్రీడల్లో రికార్డుల మోత