Turkeys earthquake: తుర్కియేలో భూకంప పన్ను ఏమైంది..? ప్రజల ఆగ్రహం..!
టర్కీలో భూకంప పన్ను వసూలు పై ఇప్పుడు ప్రశ్నలు రేగుతున్నాయి. దాదాపు 4 బిలియన్ డాలర్లకు పైగా ఉన్న ఆ మొత్తాన్ని ఎక్కడ వాడారని బాధితులు అడుతున్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: తుర్కియే(Turkey), సిరియాలో ఎమకలు కొరికే చలి మధ్య భూకంప బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఇరుదేశాల్లో కలిపి 9,000 మంది మృతి చెందారు. ప్రతి గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. అధికారులు వేగంగా స్పందించడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిరియాలో రెబల్స్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు సహాయ బృందాలు కూడా వెళ్లలేకపోతున్నాయి. తుర్కియే(Turkey) దేశమే భూకంపాలకు అత్యంత అనువైన ప్రదేశంలో ఉండటంతో దానికి విపత్తులకు సంసిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకొనేందుకు వీలుగా ప్రభుత్వం అక్కడి ప్రజల నుంచి భూకంప పన్నును వసూలు చేస్తోంది.
1999లో వచ్చిన భూకంపంలో 17,000 మంది ప్రజలు మరణించారు. నాటి నుంచి విపత్తులు సంభవిస్తే సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు పునరావాసం ఇతర కార్యక్రమాలను ఈ పన్ను నుంచి వచ్చిన సొమ్ముతో ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ నిధుల కింద రూ.4.6 బిలియన్ డాలర్లు ప్రభుత్వం వద్ద పోగుపడ్డాయి. కానీ, ఈ నిధులను ఎక్కడ వెచ్చిస్తున్నారో ఇప్పటి వరకు లెక్కలు బహిర్గతం కాలేదు. దీంతో తాజాగా ఇప్పుడు ఆ సొమ్మును ఎక్కడా లెక్కలు చూపలేదు. దీనిని తుర్కియే(Turkey) లో స్పెషల్ కమ్యూనికేషన్ ట్యాక్స్ అని కూడా పిలుస్తారు.
తుర్కియే(Turkey)లో భూకంపం వచ్చిన తొలిగంటలలో భారీగా భవనాలు కుప్పకూలిపోయాయి. టర్కిలో భవన నిర్మాణరంగలోని లోపాలను ఇది తెలియజేస్తోందని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి తోడు భూకంపాలను తట్టుకొనేలా భవన నిర్మాణ సమయంలో పాటించాల్సిన నిబంధనలు కూడా ఎక్కడా కనిపించడంలేదని అవి దుయ్యబడుతున్నాయి. నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపిస్తున్నాయి.
భూకంపం ప్రధాన కేంద్రానికి సమీపంలోని గజియన్‌తెప్ ప్రాంతంలో దాదాపు 12 గంటల పాటు ఎటువంటి సహాయక చర్యలు అందలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.‘ పోలీసులు వెంటనే జోక్యం చేసుకోవాల్సిన సమయంలో ఎవరూ రాలేదు. 1999 నుంచి మేం కడుతున్న పన్నులు ఎక్కడికి పోయాయి’ అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూకంపాలను తట్టుకొలా భవనాలను డిజైన్ చేయకపోవడం కూడా భారీ నష్టానికి ఓ కారణమని సహాయక సిబ్బంది కూడా చెబుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: సముద్రంలో హన్సిక షికారు.. ఆండ్రియా శారీ పిక్!
-
Sports News
IND vs AUS: మూడో వన్డేలో సూర్యకుమార్ని తప్పిస్తారా? రోహిత్ ఏమన్నాడంటే..
-
Movies News
Salman khan: సల్మాన్ ఖాన్కు బెదిరింపు ఈ- మెయిల్.. భద్రత మరింత పెంపు!
-
India News
Parliament: ఇంకెన్నాళ్లీ ప్రతిష్టంభన.. అడ్డంకులు సృష్టించొద్దు: ఓం బిర్లా
-
India News
Delhi Liquor Scam: ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ.. రేపు మళ్లీ రావాలని చెప్పిన అధికారులు!
-
Sports News
MIW vs DCW: ముగిసిన ముంబయి ఇన్నింగ్స్.. దిల్లీ లక్ష్యం 110