Updated : 13 Aug 2022 08:11 IST

Covid19: కొవిడ్‌ అన్ని వేరియంట్లను తట్టుకొనే యాంటీబాడీలు.. వానరాల్లో గుర్తించిన శాస్త్రవేత్తలు

లాస్‌ఏంజెలెస్‌: కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 అన్నిరకాల వేరియంట్లపై సమర్థంగా పోరాడగలిగే యాంటీబాడీలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫలితంగా భవిష్యత్తుల్లో కొవిడ్‌-19 అన్నిరకాల వేరియంట్ల నుంచి రక్షణ కల్పించే టీకాను తయారుచేసేందుకు మార్గం సుగమం కానుంది. అమెరికాలోని శాన్‌డిగోలోని స్క్రిప్స్‌ పరిశోధక సంస్థ శాస్త్రవేత్తలు కోతుల్లో ఈ కొత్త యాంటీబాడీలను గుర్తించారు. ఇవి 2003లో వ్యాప్తిచెందిన అత్యంత ప్రాణాంతకమైన సార్స్‌-కోవ్‌-1 వంటి ఇతర సార్స్‌ వైరస్‌లపైనా సమర్థంగా పోరాడుతున్నట్లు వెల్లడైంది. కొన్ని రకాల జంతువులు మనుషుల కంటే మెరుగ్గా అన్ని రకాల సార్స్‌ వైరస్‌ యాంటీబాడీలను తయారు చేసుకోగలవని అధ్యయనంలో తేలింది. శాస్త్రవేత్తలు రీసస్‌ మకాక్‌ కోతులకు రెండు డోసుల సార్స్‌-కోవ్‌-2 స్పైక్‌ ప్రొటీన్‌ రోగనిరోధక శక్తిని అందించారు. అనంతరం పరిశీలించగా.. కోతులు ఒమిక్రాన్‌ వేరియంట్‌ సహా వైరస్‌కు సంబంధించి యాంటీబాడీ స్పందనలను కలిగి ఉండడాన్ని గుర్తించారు. కొత్తగా పుట్టుకొచ్చే సార్స్‌-కోవ్‌-2 వేరియంట్లతోపాటు, ఇతర సార్స్‌ సంబంధిత వైరస్‌ల నుంచీ రక్షణ కల్పించే అధునాతన టీకాలను తయారుచేసేందుకు ఈ అధ్యయనం ఫలితాలు సహకరిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని