Artificial Intelligence: ఐవీఎఫ్‌ సాఫల్యతకు కృత్రిమ మేధ సాయం

ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) ద్వారా అభివృద్ధి చేసిన పిండంలో సాధారణ సంఖ్యలో క్రోమోజోములు ఉన్నాయా.. అసాధారణ సంఖ్యలో ఉన్నాయా అనే విషయాన్ని కృత్రిమ మేధస్సు(ఏఐ) అల్గోరిథం ద్వారా 70 శాతం కచ్చితత్వంతో గుర్తించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.

Updated : 21 Dec 2022 23:57 IST

న్యూయార్క్‌: ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) ద్వారా అభివృద్ధి చేసిన పిండంలో సాధారణ సంఖ్యలో క్రోమోజోములు ఉన్నాయా.. అసాధారణ సంఖ్యలో ఉన్నాయా అనే విషయాన్ని కృత్రిమ మేధస్సు(ఏఐ) అల్గోరిథం ద్వారా 70 శాతం కచ్చితత్వంతో గుర్తించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. అసాధారణ సంఖ్యలో క్రోమోజోములు ఉండటాన్ని ‘అన్యుప్లాయిడీ’ అని అంటారు. ఐవీఎఫ్‌లో పిండాలు విఫలమవటానికి ప్రధాన కారణాల్లో ఇదొకటి. ప్రస్తుతం అన్యుప్లాయిడీని గుర్తించటానికి బయాప్సీ లాంటి పరీక్షను అనుసరిస్తున్నారు. ఇందులో పిండాల్లోని కణాలను సేకరించి జన్యు పరీక్షలు చేస్తున్నారు. దీంతో ‘ఐవీఎఫ్‌’ ఖర్చు కూడా పెరుగుతోంది. తాజాగా కనుగొన్న స్టోర్క్‌-ఎ అనే అల్గోరిథమ్‌ పిండం చిత్రాలను సూక్ష్మంగా పరిశీలిస్తుంది. పిండం వయసు, స్వరూపం, ఐవీఎఫ్‌కు సంబంధించిన ఇతర డేటాను అందిస్తుంది. ఈ అధ్యయనాన్ని న్యూయార్క్‌కు చెందిన ‘వాల్‌ కార్నెల్‌ మెడిసిన్‌’ శాస్త్రవేత్తలు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని