Aruna Miller: అమెరికాలో తెలుగు మహిళ చరిత్ర.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అరుణా మిల్లర్‌ ఎన్నిక

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మేరీలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అరుణా మిల్లర్‌ ఎన్నికయ్యారు. ఆమె తెలుగు మహిళ కావడం విశేషం.

Updated : 09 Nov 2022 15:22 IST

వాషింగ్టన్‌: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఓ మహిళ చరిత్ర సృష్టించారు. మేరీలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తెలుగు నేపథ్యం ఉన్న అరుణా మిల్లర్‌ ఎన్నికయ్యారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్‌ కావడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.

అమెరికా మధ్యంతర ఎన్నికలు మంగళవారం పూర్తవ్వగా.. ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో మేరీలాండ్‌ గవర్నర్‌ పదవి కోసం డెమోక్రటిక్‌ నాయకుడు వెస్‌ మూర్‌, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ స్థానానికి అరుణా మిల్లర్‌ పోటీ చేశారు. ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులపై వీరిద్దరూ ఘన విజయం సాధించారు. గవర్నర్‌ తర్వాత అత్యున్నత హోదాలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఉంటారు. ఒకవేళ గవర్నర్‌ సరైన రీతిలో విధులు నిర్వర్తించలేని సమయంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తారు.

మేరీలాండ్‌లో అరుణకు ప్రజాదరణ ఎక్కువ. రిపబ్లికన్‌ మద్దతుదారులు కూడా ఆమెకు అనుకూలంగా పనిచేసినట్లు తెలుస్తోంది. వెస్‌ మూర్‌, అరుణ విజయం కోసం అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ మేరీలాండ్‌లో విస్తృతంగా ప్రచారం చేశారు. 58ఏళ్ల అరుణా మిల్లర్‌ హైదరాబాద్‌లో జన్మించారు. ఆమెకు ఏడేళ్ల వయసున్నప్పుడు 1972లో ఆమె కుటుంబం అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని