Updated : 28 Jun 2022 12:41 IST

Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!

 శాన్‌ ఆంటోనియోలో దారుణ ఘటన

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో వలసలు ప్రాణంతకంగా మారుతున్నాయి. తాజాగా టెక్సాస్‌లోని శాన్‌ ఆంటోనియోలో ఒక కంటైనర్‌ ట్రాలీలో ప్రయాణిస్తున్న 46 మంది మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 16 మంది ఆసుపత్రిపాలయ్యారు. వీరంతా వలసదారులని నగర కౌన్సిల్‌ వుమెన్‌ అడ్రియాన రోకా గార్సియా పేర్కొన్నారు. ఈ ఘటన నుంచి బయటపడిన వారి శరీర ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా అస్వస్థతకు గురైనట్లు భావిస్తున్నారు. 

ఎలా వెలుగు చూసింది..?

ఈ ఘటన వెలుగు చూసిన ప్రదేశం అక్రమ వలసల మార్గమైన అమెరికా-మెక్సికో సరిహద్దులకు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. శాన్‌ ఆంటోనియో సమీపంలోని ఒక భవనం వద్ద ఓ డ్రైవర్‌ ట్రక్కును వదిలేసి వెళ్లిపోయాడు. సాయంత్రం 6 గంటల సమయంలో అక్కడ పనిచేసే ఓ కార్మికుడికి ట్రక్కు నుంచి ఆర్తనాదాలు వినిపించాయి. దీంతో అక్కడికి వెళ్లి పరిశీలించిన కార్మికుడికి..  కంటైనర్‌ తలుపు పాక్షికంగా తెరిచి కనిపించింది. అందులో చాలా మంది అచేతనంగా పడిపోయి కనిపించారు. ప్రాణాలతో ఉన్న వారి శరీర ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఆ ట్రక్కులోని రెఫ్రిజిరేటర్లలో నీరు లేదు, ఎయిర్‌ కండీషన్‌ పని చేయడంలేదు. మరోపక్క శాన్‌ఆంటోనియోలో సోమవారం 39.4 సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. వీరంతా ఊపిరాడకో.. ఎండ వేడికో ప్రాణాలు కోల్పోయి ఉంటారని అనుమానిస్తున్నారు. 

సమాచారం తెలుసుకొన్న వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రాణాలతో ఉన్న వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని