America: అమెరికాలో విరుచుకుపడిన టోర్నడోలు.. 10 మంది మృతి
అమెరికాలోని దక్షిణ, మధ్య ప్రాచ్య రాష్ట్రాల్లో టోర్నడోలు శుక్రవారం బీభత్సం సృష్టించాయి. వీటి ధాటికి పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో నివాసాలు, దుకాణ సముదాయాలు నేలమట్టమయ్యాయి.
పదుల సంఖ్యలో క్షతగాత్రులు
లిటిల్ రాక్: అమెరికాలోని దక్షిణ, మధ్య ప్రాచ్య రాష్ట్రాల్లో టోర్నడోలు శుక్రవారం బీభత్సం సృష్టించాయి. వీటి ధాటికి పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో నివాసాలు, దుకాణ సముదాయాలు నేలమట్టమయ్యాయి. వేల సంఖ్యలో నివాసాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. వివిధ ఘటనల్లో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇండియానా రాష్ట్రంలోని సులివాన్ కౌంటీలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరికొందరి జాడ తెలియట్లేదని అధికారులు తెలిపారు. ఆర్కన్సాస్ రాష్ట్ర రాజధాని లిటిల్ రాక్ నగరంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా 25 మందికి గాయాలయ్యాయి. ఇల్లినాయ్ రాష్ట్రంలోని బెల్విడీర్‌లో సంగీత కార్యక్రమం జరుగుతున్న థియేటర్ నేలమట్టమై సందర్శకుల్లో ఒకరు మృతి చెందగా 28 మంది క్షతగాత్రులుగా మారారు. భీకర గాలులు వీస్తుండటంతో ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేయలని ఓక్లొహోమా నగరంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచించారు. టోర్నడోలతో దెబ్బతిన్న రాష్ట్రాలకు ఫెడరల్ ప్రభుత్వం అండగా ఉంటుందని అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. వచ్చే మంగళవారం మరోసారి టోర్నడోలు విరుచుకుపడతాయని అంచనాలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sengol: రాజదండాన్ని చేతికర్ర చేశారు కదా.. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన మోదీ
-
General News
CM KCR: బ్రాహ్మణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్య సమాజంపై ఉంది: కేసీఆర్
-
Sports News
Sunil Gavaskar: ధోనీ కోసం సీఎస్కే టైటిల్ గెలవాలని నా హృదయం కోరుకుంటోంది: గావస్కర్
-
India News
Heavy Rains: ముంచెత్తిన అకాల వర్షం.. 13 మంది మృతి!
-
Crime News
Crime News: కార్ ట్రావెల్స్ పెట్టాలన్న కోరికే డ్రైవర్ కొంపముంచింది
-
Sports News
IPL Final- Dhoni: చెన్నై, గుజరాత్ మధ్య ఫైనల్.. ఐపీఎల్లో చరిత్ర సృష్టించనున్న ధోనీ