విమానంలో రూ.260కోట్ల నగదు.. కొట్టేసేందుకు ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చి..!
చిలీ (Chile)లో ఎయిర్‌పోర్టులో రూ.260కోట్ల నగదును ఎత్తుకెళ్లేందుకు ఓ ముఠా చేసిన మనీ హైయిస్ట్ (Money Heist) యత్నాన్ని పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు.
శాంటియాగో: విమానంలో తరలిస్తున్న భారీ మొత్తంలోని నగదు (Money)ను కొల్లగొట్టేందుకు ఓ ఘరానా దొంగల ముఠా విఫలయత్నం చేసింది. సినీ ఫక్కీలో ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చి డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఎయిర్‌పోర్టు (Airport) అధికారులు అప్రమత్తమవడంతో ఈ భారీ ‘మనీ హైయిస్ట్ (Money Heist)’ను అడ్డుకోగలిగారు. చిలీ (Chile) రాజధాని శాంటియాగోలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఫ్లోరిడా (Florida)లోని మియామీ నుంచి 32.5 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.262 కోట్లకు పైనే) నగదును ప్రత్యేక విమానంలో బుధవారం చిలీకి తీసుకొచ్చారు. ఆ నగదును చిలీలోని పలు బ్యాంకులకు తరలించాల్సి ఉంది. శాంటియాగోలోని విమానాశ్రయంలో ఈ విమానం (Flight) దిగగానే అందులోని డబ్బును ఓ సాయుధ ట్రక్కులోకి తరలిస్తుండగా ఉన్నట్టుండి ఓ దొంగల ముఠా దాడి చేసింది. వాహనాలతో విమానాశ్రయ గేటును బద్దలుకొట్టి ఆ ముఠా రన్‌వేపైకి చొచ్చుకొచ్చింది.
అందులో కొందరు దొంగలు భద్రతా సిబ్బందిపై దాడి చేసి ఆయుధాలు లాక్కున్నారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు పోలీసులు వెంటనే వారిపైకి కాల్పులు జరిపారు. దీంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల ఘటనలో పౌరవిమానయాన ఉద్యోగి ఒకరు మృతిచెందగా.. నిందితుల్లో ఒకడు హతమయ్యాడు. మిగతవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటన తర్వాత డబ్బు సురక్షితంగానే ఉందని అధికారులు వెల్లడించారు.
కాగా.. శాంటియాగో ఎయిర్‌పోర్టులో ఇలాంటి ఘరానా దోపిడీలు కొత్తేం కాదు. 2020లో ఓ దొంగల ముఠా.. ఎయిర్‌పోర్టులోని ఓ గోదాంలో ఉంచిన 15 మిలియన్ డాలర్ల విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లింది. అంతకుముందు ఆరేళ్ల క్రితం కూడా 10 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: పని ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
-
General News
Mekapati Chandrasekhar Reddy: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత
-
Movies News
Kajal: బాలీవుడ్లో నైతిక విలువలు లోపించాయి.. కాజల్ కీలక వ్యాఖ్యలు
-
Sports News
IPL 2023: ఆ జట్టుదే ఐపీఎల్ 16వ సీజన్ టైటిల్: మైకెల్ వాన్
-
General News
Sajjanar: గొలుసుకట్టు సంస్థలకు ప్రచారం చేయొద్దు: అమితాబ్‌కు సజ్జనార్ విజ్ఞప్తి
-
World News
Donald Trump: నేరారోపణల ధ్రువీకరణ.. ట్రంప్ అరెస్టు తప్పదా..?