Aung san suu kyi : అవినీతి కేసులో ఆంగ్‌ సాన్‌ సూకీకి ఐదేళ్ల జైలు శిక్ష!

మయన్మార్‌ కీలక నేత, నోబెల్‌ బహుమతి విజేత ఆంగ్​ సాన్​ సూకీకి అక్కడి జుంటా కోర్టు

Published : 27 Apr 2022 14:18 IST

యాంగోన్‌: మయన్మార్‌ కీలక నేత, నోబెల్‌ బహుమతి విజేత ఆంగ్​ సాన్​ సూకీకి అక్కడి జుంటా కోర్టు అవినీతి కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 6 లక్షల డాలర్ల నగదును, బంగారు కడ్డీలను లంచంగా తీసుకున్నట్లు సూకీ మీద ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆమె అవినీతికి పాల్పడినట్లు కోర్టు బుధవారం నిర్ధారించింది. అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆమె ఎదుర్కొంటున్న 11 కేసుల్లో ఇది ఒకటి.

మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తరవాత ఆమెను గత సంవత్సరం ఫిబ్రవరి 1న అరెస్టు చేశారు. సాధారణ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆమెను పదవి నుంచి తొలగించారు. ఆమెతో పాటు పలువురు నేతలను కూడా నిర్బంధంలోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని