Aung San Suu Kyi: అవినీతి కేసులో ఆంగ్ సాన్ సూకీకి ఆరేళ్ల జైలు శిక్ష!
మయన్మార్ కీలక నేత, నోబెల్ బహుమతి విజేత ఆంగ్సాన్సూకీ(77)కి అక్కడి కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించినట్లు సమాచారం. నాలుగు అవినీతి కేసులతో సూకీకి సంబంధం ఉన్నట్లు పేర్కొంటూ........
యాంగోన్: మయన్మార్ కీలక నేత, నోబెల్ బహుమతి విజేత ఆంగ్సాన్సూకీ(77)కి అక్కడి కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించినట్లు సమాచారం. నాలుగు అవినీతి కేసులతో సూకీకి సంబంధం ఉన్నట్లు పేర్కొంటూ కోర్టు ఆమెకు ఆరేళ్ల జైలు శిక్షను ఖరారు చేసినట్లు అనధికార వర్గాలు తెలిపాయి. దేశంలో ఆరోగ్యం, విద్యను ప్రోత్సహించేందుకు ఆమె స్థాపించిన ‘డా ఖిన్ క్యీ’ ఫౌండేషన్ నిధులను దుర్వినియోగం చేశారంటూ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని రాయితీ ధరకు లీజుకు తీసుకున్నట్లు తేల్చిన న్యాయస్థానం శిక్ష ఖరారు చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి.
మయన్మార్లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తరవాత సూకీని గతేడాది ఫిబ్రవరి 1న అరెస్టు చేశారు. సాధారణ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆమెను పదవి నుంచి తొలగించారు. ఆమెతో పాటు పలువురు నేతలను కూడా నిర్బంధంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి సూకీని నిర్బంధంలోనే ఉంచి ఆమెపై పలు కేసులు మోపుతున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో ఆమెకు జైలు శిక్షలు కూడా విధించారు.
1989-2010 మధ్యలో ఆంగ్ సాన్ సూకిని దాదాపు పదిహేనేళ్లపాటు సైన్యం గృహ నిర్బంధంలోనే ఉంచింది. ఇప్పుడు మరిన్నిఅభియోగాల్లో దోషిగా తేల్చింది. వాకీటాకీలను అక్రమంగా దిగుమతి చేసుకున్నారని.. 6 లక్షల డాలర్ల నగదును, బంగారు కడ్డీలను లంచంగా తీసుకున్నారని ఇప్పటికే వరుసగా 4, 5సంవత్సరాలపాటు జైలు శిక్ష విధించింది. మిగిలిన వాటిలోనూ దోషిగా తేలితే.. వందేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదే జరిగితే 77 ఏళ్ల సూకీ.. మిగిలిన జీవితమంతా బందీగానే గడపాల్సి వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్