Australia: డాల్ఫిన్లతో ఈతకని దిగి.. సొర చేపకు చిక్కి..!
నదిలో డాల్ఫిన్లకు సమీపంలో ఈత కొట్టేందుకు దిగిన ఓ యువతి.. అంతలోనే సొర చేప దాడిలో మృతి చెందింది. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాన్‌బెర్రా: సరదాగా డాల్ఫిన్ల(Dolphins)తో ఈత కొట్టేందుకు నదిలో దిగిన ఓ 16 ఏళ్ల బాలిక.. అంతలోనే సొర చేప(Shark Attack)కు బలయ్యింది. ఆస్ట్రేలియా(Australia)లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. ఓ బాలిక తన స్నేహితులతో కలిసి పెర్త్ (Perth) శివారు నార్త్ ఫ్రీమాంటిల్‌లోని స్వాన్ నది (Swan River)లో విహారానికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఓ చోట డాల్ఫిన్ల గుంపు కనిపించడంతో.. వాటికి సమీపంలో ఈత కొట్టేందుకు ఆమె నదిలోకి దూకింది. అంతలోనే ఓ షార్క్ ఆమెపై దాడికి దిగడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఒడ్డుకు చేర్చి, కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది.
ఏ రకం సొర చేప దాడి చేసిందో గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. నదిలోని ఆ భాగంలో షార్క్‌లు కనిపించడం అసాధారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నదిలోకి దిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలు పాటించాలని స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. తరోంగా కన్జర్వేషన్ సొసైటీ వివరాల ప్రకారం ఆస్ట్రేలియాలో చివరిసారి 1960లో నదిలో షార్క్ దాడి సంబంధిత మరణం నమోదైంది. సిడ్నీలోని రోజ్‌విల్లే బ్రిడ్జ్ వద్ద జరిగిన ఈ ఘటనలో 3.3 మీటర్ల పొడవైన బుల్ షార్క్ ఓ వ్యక్తిని బలిగొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు