china: ఆస్ట్రేలియా విమానంపై చైనా లేజర్‌ ప్రయోగం

చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ ఆరోపించారు. చైనా నౌక ఒకటి ఆస్ట్రేలియా నిఘా విమానంపై లేజర్‌ను ఉపయోగించిన తర్వాత మారిసన్‌ ఈ విధంగా

Published : 20 Feb 2022 14:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ ఆరోపించారు. చైనా నౌక ఒకటి ఆస్ట్రేలియా నిఘా విమానంపై లేజర్‌ను ఉపయోగించిన తర్వాత మారిసన్‌ ఈ విధంగా స్పందించారు. ‘‘ చైనా కవ్వింపు చర్యలుగానే వీటిని నేను చూస్తాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా రక్షణ మంత్రి పీటర్‌ డట్టోన్‌ మాట్లాడుతూ ‘‘ఇదొక ప్రమాదకర చర్య. చైనా దూకుడు చర్యలపై ఎవరూ మాట్లాడకూడదని బీజింగ్‌ భావిస్తున్నట్లుంది’’ అని పేర్కొన్నారు.

ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన పీ-8ఏ పొసైడాన్‌ నిఘా విమానంపై లేజర్‌ను ప్రయోగించినట్లు నిన్న ఆస్ట్రేలియా రక్షణ శాఖ ప్రకటించింది. పీఎల్‌ఏకు చెందిన రెండు నౌకలు టోరస్‌ జలసంధిని దాటుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. లేజర్‌ ప్రభావంతో పైలట్లు గందరగోళానికి గురికావడం కానీ, తాత్కాలికంగా వారి కంటి చూపు దెబ్బతినడంకానీ జరుగుతుందని ఆస్ట్రేలియా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ నౌకలు కోరల్‌  సముద్రంలో ఉన్నాయి. రెండేళ్ల క్రితం అమెరికా నిఘావిమానంపై కూడా చైనా లేజర్లను వాడినట్లు ఆరోపణలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని