Azerbaijan-Armenia clash: అజర్‌బైజాన్-ఆర్మేనియా మధ్య యుద్ధ వాతావరణం!
అజర్‌బైజాన్ (Azerbaijan), ఆర్మేనియా (Armenia) మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.
Image: MartinAlex06
ఇంటర్నెట్ డెస్క్: వివాదాస్పద నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ప్రారంభించినట్లు అజర్‌బైజాన్ (Azerbaijan) రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే ఈ మిలటరీ షెల్లింగ్ కారణంగా ఒక చిన్నారి సహా ఇద్దరు పౌరులు మృతిచెందినట్లు ఆర్మేనియన్ మీడియా వెల్లడించింది. మరో 11 మంది గాయపడినట్లు తెలిపింది. నాగోర్నో-కరాబాఖ్ అజర్‌బైజాన్‌లోని ఆర్మేనియా (Armenia) భూభాగం. ఈ ప్రాంతం కోసం ఇరుదేశాల మధ్య రెండు యుద్ధాలు జరిగాయి. 2020లోనూ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అజర్‌బైజాన్ దళాలు లాచిన్ కారిడార్‌ను దిగ్బంధించడంతో నెల రోజులుగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగోర్నో-కరాబాఖ్‌ను ఆర్మేనియాతో అనుసంధానించే రోడ్డును ధ్వంసం చేయడం వివాదాస్పదంగా మారింది.
అబ్బే.. ఉక్రెయిన్‌కు మేము ఆయుధాలు అమ్మట్లేదు..: పాకిస్థాన్
2020లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తరువాత ఇక్కడ రష్యా శాంతి పరిరక్షకులు మోహరించారు. తాజా వివాదాన్ని చల్లార్చాల్సిన బాధ్యత వారిపై ఉంది. అజర్‌బైజాన్ దూకుడు నేపథ్యంలో మాస్కో జోక్యం చేసుకోవడానికి వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. స్టెపానాకెర్ట్‌లో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, అలాగే ఆర్మేనియా దళాలు అక్కడ్నుంచి వెళ్లిపోవాలని అజర్‌బైజార్ రక్షణ మంత్రిత్వశాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అప్పుడు మాత్రమే శాంతి నెలకొంటుందని తేల్చిచెప్పింది. 2020లో ఈ ప్రాంతంపై పట్టు కోసం ఆర్మేనియా-అజర్‌బైజాన్‌లు దాదాపు ఆరు వారాల యుద్ధం చేశాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. నాటి నుంచి రష్యా శాంతి పరిరక్షకులు ఇక్కడ ఉన్నారు. ఆ యుద్ధంలో టర్కీ సరఫరా చేసిన డ్రోన్లను అజర్‌బైజాన్ వినియోగించి ఆర్మేనియాను భారీగా దెబ్బ తీసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Festival Sale: అమెజాన్ పండగ సేల్‌లో TVలపై ఆఫర్లివే..
-
Afghan embassy in India: భారత్‌లో అఫ్గాన్ ఎంబసీని మూసేస్తున్నారా? కేంద్రానికి మెసేజ్..!
-
Elon Musk: వలసదారులకు నేను అనుకూలం : ఎలాన్ మస్క్
-
TDP: సొంత భూమే పోగొట్టుకున్నా.. నేను అవినీతి చేస్తానా?: మాజీ మంత్రి నారాయణ
-
Siddharth: కన్నడ ప్రజల తరపున సిద్ధార్థ్‌కు క్షమాపణలు: ప్రకాశ్ రాజ్
-
Canada: హంతకులకు ఆశ్రయం ఇస్తున్నారు.. కెనడాపై బంగ్లాదేశ్ మంత్రి తీవ్ర ఆరోపణలు