Frontier Airlines: విమానంలో మహిళ ప్రసవం.. శిశువుకు ‘స్కై’గా నామకరణం

విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికురాలు పెరిగిపోయింది. అదేలాగ అనుకుంటున్నారా? ఎగురుతున్న విమానంలోనే ఓ మహిళ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది.......

Published : 22 May 2022 02:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికురాలు పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన అమెరికాకు చెందిన ప్రాంటియర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో చోటుచేసుకుంది. డెన్వర్‌ నుంచి ఒర్లాండోకు వెళుతున్న విమానంలో షకేరియా మార్టిన్‌ అనే గర్భిణి ప్రయాణించారు. అయితే విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో విమాన సిబ్బందిలో ఒకరైన డయానా గిరాల్డో అనే మహిళ షకేరియాను బాత్‌రూంలోకి తీసుకెళ్లగా ఆమె అందులోనే ప్రసవించారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ప్రాంటియర్‌ ఎయిర్‌లైన్స్‌ ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా వెల్లడించింది.

ప్రసవానికి సహకరించిన సిబ్బంది డయానా గిరాల్డోను ఆ సంస్థ ప్రశంసించింది. అది వీరోచితమైన పనిగా ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ కెప్టెన్ క్రిస్ నై, విమాన సిబ్బంది అందరూ డయానా గిరాల్డోను కొనియాడారు. విమానంలో జన్మించిన ఆ శిశువుకు కుటుంబ సభ్యులు ‘స్కై’గా నామకరణం చేసినట్లు ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. ప్రసవం అనంతరం ఒర్లాండో విమానాశ్రయ సిబ్బందికి ఈ విషయం తెలియజేశామని.. ల్యాండ్‌ కాగానే తల్లీబిడ్డను వైద్యులు పరీక్షించి ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని